వాడిని 100సార్లకంటే ఎక్కువే తలుచుకున్నా...విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్‌లో కి వచ్చేముందు ఏమైందంటే.?  

Tv9 Deepti Nallamothu About Bigg Boss Show Experience-

బిగ్ బాస్ రెండో సీజన్ గత వారంతో ముగిసింది. అందరు అనుకున్నట్టుగానే కౌశల్ విజేతగా నిలిచారు. గీత మాధురి, తనీష్, సామ్రాట్ ఫైనల్స్ వరకు వచ్చారు కానీ గెలవలేకపోయారు..

వాడిని 100సార్లకంటే ఎక్కువే తలుచుకున్నా...విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్‌లో కి వచ్చేముందు ఏమైందంటే.?-Tv9 Deepti Nallamothu About Bigg Boss Show Experience

ఇక మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే దీప్తి నల్లమోతు అదే అంది అంది మన టీవీ 9 దీప్తి గారు అనే చెప్పాలి. మొదట్లో దీప్తి, యాంకర్ శ్యామల అనుబంధం చూసి మన ఫామిలీ లో ఒకరి లాగ కలిసిపోయారు అనుకున్నారు ఆడియన్స్. కాకపొతే షో గడిచేకొద్దీ దీప్తి ని నస అనడం మొదలుపెట్టారు. ఈ మాట బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న నాని గారు కూడా అన్నారు.

మధ్యలో ఓ సారి దీప్తికి పడేవి అన్ని ఫేక్ ఓట్లు అని కూడా ఓ సారి న్యూస్ వచ్చింది. ఏది ఏమైనా ఆమె చివరి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్. షో పూర్తి అయ్యాక మొదటి సారి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడింది దీప్తి. ‘సాధారణంగా అమ్మాయికి పెళ్లి కాగానే కొన్ని ఆంక్షలు ఉంటాయి.

అదృష్టవశాత్తు నాకు ఆ బాధలేదు. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్‌. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో ‘బిగ్‌బాస్‌ 2’లో అడుగుపెట్టాను..

అంతేకాదు…వంద రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల నా కొడుకుతో మాట్లాడలేకపోయాను. ఈ క్రమంలో వాడిని 100 సార్లకంటే ఎక్కువే తలచుకున్నా.ఏ ఆటలో అయినా విజేత ఒక్కరే ఉంటారు. బిగ్‌బాస్‌ 2 షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కానీ కౌశల్ గెలుపొందడంతో తామంతా నిరాశకు లోనయ్యాము అని వాళ్లంటే తననింత మంది అభిమానించారా అని ఆశ్చర్యమేసింది.

నేను మాత్రం చాల స్పోర్టివ్ గా తీసుకున్నా. ప్రతి టాస్క్‌లో నేను ఎంత ఎఫర్ట్ అయితే ఇవ్వగలనో అంత ఇచ్చాను. ఇక బిగ్ బాస్2 మొదలవడానికంటే ముందు ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్‌లో ట్రావెల్‌ చేస్తున్నప్పుడు గీత(గీతామాధురి) అక్కతో క్యాజువల్‌గా మాట్లాడాను. ఆమెతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు.

కానీ బిగ్ బాస్ లో తాను ఒక కంటెస్టెంట్ ను అన్న విషయాన్నీ జీవితాంతం మరచిపోలేను అంటూ తన అభిప్రాయాల్ని పంచుకుంది దీప్తి.