మొత్తానికి టీవీ9 సీఈవో పై వేటు పడింది

టీవీ9 సీఈవో రవి ప్రకాష్ పై వేటు పడింది.సంస్థ నిర్వహణలో వైఫల్యం అలానే ఫోర్జరీ ఆరోపణల తో అతడిని నూతన యాజమాన్యం సీఈఓ పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.

 Tv9 Ceo Ravi Prakash Booked For Forgery-TeluguStop.com

కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేస్తుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అతనిపై అంతర్గత విచారణ చేపట్టిన కొత్త యాజమాన్యం ఆయనను ఆ పదవి నుంచి వైగోలగాలని కొన్ని రోజులుగా ఆదేశాలు జారీ చేసినా రవి ప్రకాష్ పట్టించుకోనట్లు సమాచారం.

అంతేకాకుండా టీవీ 8 శాతం షేర్స్ ఉన్న రవి 90 శాతం పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాలరాస్తున్నారని కూడా కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తోంది.

కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారంటూ యాజమాన్యం ఆరోపిస్తోంది.మరోపక్క రవి ప్రకాష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది.

తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube