బిగ్ బాస్ 5లో tv5 మూర్తి, tv9 నుంచి ఆమె.. ఎవరంటే?

బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కంటే రియాలిటీ ప్రోగ్రామ్స్ లే బాగా ఆసక్తిగా ఉంటాయి.అందులో ముఖ్యంగా బిగ్ బాస్ అని చెప్పవచ్చు.

 బిగ్ బాస్ 5లో Tv5 మూర్తి, Tv9 నుంచి ఆమె.. ఎవరంటే?-TeluguStop.com

ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదవ సీజన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏడాది కరోనా మొదటి వేవ్ కారణంగా సీజన్ ఫోర్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.

 బిగ్ బాస్ 5లో Tv5 మూర్తి, Tv9 నుంచి ఆమె.. ఎవరంటే?-బిగ్ బాస్ 5లో Tv5 మూర్తి, Tv9 నుంచి ఆమె.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో సీజన్ 5 ను కూడా త్వరగా ప్రారంభించారని అనుకోగా ఈసారి కరోనా సెకండ్ వేవ్ మళ్లీ అడ్డు పడింది.

దీంతో ఈ షో ప్రారంభం కావడానికి కాస్త సమయం పడటంతో ప్రస్తుతం పలు ఏర్పాట్లతో సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.ఇక తాజాగా కంటెస్టెంట్ లను ఎంపిక కూడా చేస్తున్నారు.

ఇక ఇందులో టీవీ న్యూస్ యాంకర్లు కూడా గేమ్ లో పాల్గొనడానికి వస్తున్నారని తెలుస్తోంది.అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన స్టార్ లు కూడా ఈ షో లో పాల్గొననున్నారు.

గత సీజన్ లలో పలువురు న్యూస్ యాంకర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సీజన్ లో మరో ముగ్గురు న్యూస్ యాంకర్స్ కూడా రానున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరంటే.టీవీ ఫైవ్ నుంచి మూర్తి, హెచ్ ఎం టీవీ నుంచి యాంకర్ రోజా, టీవీ9 నుంచి యాంకర్ ప్రత్యూష లు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.

Telugu Anchor Ravi, Big Boss Season 5, Bigg Boss 5 Contestants, Corona Effect, Hmtv Roja, Jaswanth, Maa Tv, Mahatalli, Reality Show, Tv 5 Murthy, Tv9 Pratyusha-Movie

అంతేకాకుండా సోషల్ మీడియా నుండి సెలబ్రిటీలుగా మారిన షణ్ముఖ్ జస్వంత్, టిక్ టాక్ స్టార్ మహా తల్లి, యాంకర్ రవి పలువురు వస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే మరికొందరు సెలబ్రెటీల పేర్లు వినిపించగా.వాళ్లు స్పందించడంతో ఇవన్నీ పుకార్లేనని తేల్చిచెప్పారు.ఇక ఈ షో కూడా సీజన్ 3 లాగే సెప్టెంబర్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

#Maa Tv #Reality Show #Corona Effect #Mahatalli #Tv9 Pratyusha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు