వచ్చే వారంతో టీవీ కష్టాలు తీరిపోనున్నాయి  

Tv Serials Shootings Start Next Week - Telugu Corona Effect, Lockdown, Telangana, Tv Serial Shootings, Tv Shows

గత రెండు నెలల కాలంగా బుల్లి తెర నటీనటులు మరియు మేకర్స్‌ యాజమాన్యాలు కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టెలికాస్ట్‌ చేసేందుకు సీరియల్స్‌, షోలు లేకపోవడంతో పాత వాటిని వేసినవే వేసి ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారు.

 Tv Serials Shootings Start Next Week

ప్రేక్షకులు కూడా చాలా టీవీ పెడితే చూసిన కార్యక్రమాలు, సీరియల్స్‌ వస్తుండటంతో బోరింగ్‌ ఫీల్‌ అయ్యారు.గత రెండు నెలలుగా బుల్లి తెర పరిశ్రమ పడుతున్న ఇబ్బందులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నారు.
సీరియల్స్‌ మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి, షోలు షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం కొత్త లాక్‌డౌన్‌ను తీసుకు వచ్చింది.అందులో భాగంగా షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వబోతుంది.రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఇప్పటికే షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా షూటింగ్స్‌ నిర్వహించుకోవచ్చు అంటూ ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వబోతున్నాయి.
ఈనెలలోనే బుల్లి తెర కార్యక్రమాలకు సంబంధించిన షూటింగ్స్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వచ్చే వారంతో టీవీ కష్టాలు తీరిపోనున్నాయి-Movie-Telugu Tollywood Photo Image

పెద్ద సినిమాలు ఒకటి రెండు షూటింగ్‌ ప్రారంభం కానుండగా సీరియల్స్‌ మరియు షోలు అన్ని షూటింగ్స్‌ పున: ప్రారంభం కాబోతున్నాయి.దాంతో ఈ నెల మూడవ వారం వరకు సీరియల్స్‌ కొత్త ఎపిసోడ్స్‌ మరియు షోలకు సంబంధించిన కొత్త ఎపిసోడ్స్‌ ను ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tv Serials Shootings Start Next Week Related Telugu News,Photos/Pics,Images..

footer-test