వివాహేతర సంబంధం కారణంగా సీరియల్ నటి దారుణ హత్య

Tv Serial Actress Anitha Killed By Her Husband In Delhi

ప్రస్తుత కాలంలో కొందరు తమ జీవిత భాగస్వామిపై లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ క్షణికావేశానికి లోనై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా టీవీ సీరియళ్లలో నటించేటువంటి ఓ నటి వివాహేతర సంబంధం అనే అనుమానం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్ర రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో కలకలం రేపింది.

 Tv Serial Actress Anitha Killed By Her Husband In Delhi-TeluguStop.com

విఅవ్రల్లోకి వెళితే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో అనిత అనే ఓ సీరియల్ నటి తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.ఈమె వృత్తి రీత్యా పలు రకాల టీవీ సీరియళ్లలో నటిస్తూ సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

అయితే వృత్తి రీత్యా అనిత పలువురితో సన్నిహితంగా మెలిగేది.దీంతో రవీంద్ర నిత్యం అనితను అనుమానిస్తూ వచ్చేవాడు.దీంతో ఈ అనుమానం కాస్త తుఫాన్ లాగా చిలికి చిలికి పెద్ద వాన అయినట్లు రోజు రోజుకి ఆమెపై అనుమానాన్ని పెంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో  ఆమె హతమార్చాలని తన మిత్రుడితో కలిసి పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగా నటి అనితను ముంబై నగరానికి తీసుకువచ్చి ఆమెకు మత్తు మందు ఇచ్చి ఉరివేసి హతమార్చారు.అనంతరం మృతదేహాన్ని పెట్రోలు పోసి తగలబెట్టారు.

ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయితే శవం కాలిన వాసనను గమనించిన స్థానికులు దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పోస్టుమార్టం ఆధారంగా మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు.ఇందులో భాగంగా నటి భర్త రవీంద్రను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంగా తానే హతమార్చినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

#Delhi #Tv Actress #Delhi #Delhi #Tv Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube