బిగ్ బాస్ 5 అప్ డేట్ .. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

గతేడాది లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకుల అంచనాలను మించి ఎంటర్టైన్మెంట్ అందించిన షోగా బిగ్ బాస్ సీజన్ 4 పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.పరిచయం లేని కంటెస్టెంట్లు అయినా షో రొటీన్ గా సాగుతుందని విమర్శలు వచ్చినా నాగార్జున మాత్రం సీజన్ 4ను సక్సెస్ చేశారు.

 Tv Reality Show Big Boss Season 5 Details-TeluguStop.com

అయితే బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం గురించి గతంలో ఎన్నో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

వాస్తవానికి జూన్ లేదా జులైలో బిగ్ బాస్ షోను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావించారు.

 Tv Reality Show Big Boss Season 5 Details-బిగ్ బాస్ 5 అప్ డేట్ .. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఇప్పటికే సీజన్ 5కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైందని తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నెలలో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.గతేడాదిలా కంటెస్టెంట్లను క్వారంటైన్ లో ఉంచనున్నారని సమాచారం.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితులు పూర్తిగా మారడంతో పాటు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

Telugu Akkineni Nagarjuna, Bigg Boss 5 Date, Bigg Boss 5 In August, Bigg Boss Season 5, Bigg Boss Show, Corona Effect, Corona Second Wave, Host Nagarjuna, Postponed Details-Movie

ఆగష్టు నాటికి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.గతేడాది కరోనా సమయంలో ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ ను అందించడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సీజన్ ను త్వరగా స్టార్ట్ చేయాలని చెబుతున్నారు.

సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 5కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.గత రెండు సీజన్లు నాగార్జున వల్లే హిట్టైన సంగతి తెలిసిందే.

#Bigg Boss Show #Corona Effect #Host Nagarjuna #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు