న్యూస్ ఛానెల్స్ లో లైవ్ లో వార్తలు చదివే సమయంలో న్యూస్ రీడర్స్ ఎంతో ఏకాగ్రతతో చదవాలి.చిన్న పొరపాటు చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు.
అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చిన వాటిని పట్టించుకోకుండా ఎంతో జాగ్రత్తగా కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు.ఇంకా ఈ న్యూస్ రీడర్ కూడా అంతే.
లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలో ఆమె పన్ను ఊడి వచ్చింది.దీంతో ఆమె వెంటనే దాన్ని కవర్ చేసుకుంది.వార్తలు చదవడం కొనసాగించింది.ఇంకా ఈ ఘటన ఉక్రేయిన్ లో చోటు చేసుకుంది.
టీఎస్ఎస్ చానెల్ న్యూస్ రీడర్ మరీచా పదాల్కో సీరియస్గా కరోనా వైరస్ సమాచారాన్ని చదువుతున్న సమయంలో పై పన్ను ఊడిపోయింది.
దీంతో పన్నును చేత్తో పట్టుకొని ఎక్కడ డిస్ట్రబ్ కాకుండా వార్తలు చదివింది.
ఇంకా ఆ పన్ను ఊడినప్పటికీ ఎక్కడ తడబడకుండా వార్తలు చదవడం కొనసాగించింది.ఇంకా ఈ వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చెయ్యగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీ పని పట్ల మీకు ఎంత శ్రద్ద ఉంది అనేది ఈ వీడియో చూస్తుంటే అర్ధం అవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.