జుట్టు కత్తరించుకుందని యాంకర్ ని తీసేసిన టీవీ ఛానెల్.. ఏం జరిగిందంటే?

మామూలుగా యాంకర్ గా చేయాలంటే అందులో స్త్రీలైన, పురుషులైనా కెమెరాకు అందంగా కనిపించాలి.ముఖ్యంగా చూసే ప్రేక్షకులకు అందంగా కనిపించాలి.

 Tv Channel That Removed The Anchor Because She Cut His Hair Do You Know What Hap-TeluguStop.com

చాలా వరకు లేడీ యాంకర్లను ఎక్కువగా తీసుకుంటారు.ఎందుకంటే చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారని వాళ్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు.

ఇక లేడి యాంకర్ లు చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా మంచి స్వరంతో ఉంటారు.ఇక వాళ్ళల్లో ఏదైనా అందం లోపిస్తే మాత్రం వాళ్లను యాంకర్ గా తొలగిస్తారు.

ఇప్పటికే చాలా టీవీ ఛానల్స్ లేడీ యాంకర్ ల విషయంలో అందం లోపించిన, వయసుపైబడిన వాళ్లను వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు.ఇదిలా ఉంటే గతంలో ఓ యాంకర్ ను కూడా తను జుట్టు కత్తిరించుకుందని ఓ టీవీ ఛానల్ ఆమెను తీసేసింది.

ఇంతకీ ఆ టీవీ యాంకర్ ఎవరు.ఆమె జుట్టు ఎందుకు కత్తిరించకుందో తెలుసుకుందాం.

కొన్ని ఏళ్ళ కిందట మలేషియాకు చెందిన NTV 7 అనే న్యూస్ ఛానల్ లో ‘రాస్ అదిబా‘ అనే ఓ ముస్లిం యువతి యాంకర్ గా చేసింది.ఇక ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారికి ఆ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసం తన జుట్టును కత్తిరించుకుంది.

ఆమె పూర్తి జుట్టుని కత్తిరించుకోకుండా కాస్త జుట్టు ఉండేలా ఉంచుకుంది.ఎందుకంటే పూర్తిగా గుండు అయితే న్యూస్ యాంకర్ జాబుకి అన్ ఫిట్ గా ఉంటుందని అందుకే పూర్తిగా గుండు చేయించుకోకుండా కాస్త జుట్టు ఉండేలా ఉంచుకుంది.

ఇక ఆమె ఇలా చేసినందుకు ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఆమెను యాంకరింగ్ ఉద్యోగం నుంచి తొలగించారు.అంతేకాకుండా ఆమెకు మతాధికారుల నుంచి కూడా వార్నింగ్ వచ్చిందని తెలిసింది.

దీంతో ఆమెకు ఫత్వా జారీ చేయగా అందులో రాస్ అదీబా మాత్రం అసలు భయపడకుండా తాను క్యాన్సర్ వ్యాధిపై అవగాహన తెప్పించడం కోసమే ఇలా జుట్టును కత్తిరించుకున్నాను అని తెలిపింది.

అంతే కానీ తాను మరో ఉద్దేశంతో గుండు చేయించుకోలేదని తెలిపింది.

నిజానికి క్యాన్సర్ వ్యాధి వస్తే చాలామంది ప్రాణాలు పోతాయన్న భయం లోనే ఉంటారు.కాబట్టి ఆ వ్యాధి వచ్చిందని ముందుగా గుర్తిస్తే దాని నుంచి బయటపడటం సాధ్యమే అని అందుకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుందని సైతం వైద్య నిపుణులు తెలిపారు.

ఇక దాంతో గతంలో ఈ వ్యాధి నిరోధంపై అవగాహన కల్పించడానికి 350 సంస్థలు కొన్ని కార్యక్రమాలను చేపట్టాయి.ఈ వ్యాధి సోకితే మరణం సంభవించడం అనేది చాలామంది అధిగమించారు.

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో కొందరు ఈ వ్యాధిని ముందుగానే తెలుసుకోవడంతో వ్యాధి నుంచి బయట పడ్డారు.చాలామంది నటీనటులకు క్యాన్సర్ వ్యాధి ఉండటం తో ముందుగానే వ్యాధిని తెలుసుకొని చికిత్స చేయించుకోని వ్యాధి నుంచి బయట పడ్డారు.

దాంతో ఆ యాంకర్ కూడా అందరికీ అవగాహన కల్పించడానికి అలా చేశానని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube