యాంకరింగ్ రోబోలు వచ్చేశాయి... ఇక వారి ఉద్యోగాలకి మూడినట్లే...

ప్రపంచం సాంకేతిక పరంగా రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.అలాగే యాంత్రిక జీవనానికి అలవాటు పడినటువంటి మనిషి ప్రస్తుత కాలంలో యంత్రం లేకుండా బతకలేకపోతున్నాడు.

 News, Readers, Robo Anchors, Jin Hu, China News-TeluguStop.com

దీంతో అవసరం ఉన్నా, లేకున్నా యంత్రం మాత్రం మానవ జీవితంలో ఒక భాగంగా నిలుస్తోంది.కాగా తాజాగా చైనా దేశానికి చెందినటువంటి ఓ న్యూస్ ఏజెన్సీ సంస్థ తమ చానల్లో వార్తలు చదివేందుకుగాను ఓ రోబోని తయారు చేయించుకుంది.

అయితే ఈ రోబో అందమైన రూపం కలిగి ఉండడమే కాకుండా వార్తలను కూడా గలగలా చదువుతూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ప్రస్తుతానికి ఇది ప్రయోగమే అయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా పలు న్యూస్ ఏజెన్సీ సంస్థలు వార్తలు చదివేందుకు కచ్చితంగా రోబోట్లను ఉపయోగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

దీనికితోడు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంతమంది యాంకర్లు చానల్స్  కార్యాలయానికి వచ్చి వార్తలు చదవాలంటే కొంతమేర భయపడుతున్నారు.దీంతో ఈ సమస్యను అధిగమించాలని చానల్ నిర్వాహకులు చేసినటువంటి ఈ ప్రయోగం దాదాపుగా విజయం సాధించినట్లు తెలుస్తోంది.

ఐతే ఇప్పటికే జపాన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా రోబోల వినియోగం బాగా ఎక్కువగా ఉంది.దీంతో భవిష్యత్తులో ఇలాగే యాంత్రిక ఉపయోగం ఎక్కువయితే పలు రంగాల్లోని ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని కొంత మంది ఉద్యోగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాబట్టి కష్టతరమైనటువంటి పనులకు తప్ప  మనుషులు చేయగలిగిన పనులకి రోబోలను ఉపయోగించడం సరికాదని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube