పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టీవీ యాంకర్.. సంతోషంతో అలా?

యాంకర్ గా, బుల్లితెర నటిగా సమీరా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.జీ తెలుగు ఛానల్ లో సమీరా హోస్ట్ గా ప్రసారమైన అదిరింది షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Tv Anchor Sameera Birth Baby Boy Photo Goes Viral In Social Media, Instagram Pos-TeluguStop.com

అయితే ప్రేక్షకుల్లో సమీరాకు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో కొన్ని వారాల తర్వాత ఆమెను ఆ షో నుంచి తొలగించారు.అయితే తాజాగా సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సెప్టెంబర్ 4వ తేదీన తమ ఫ్యామిలీలోకి మగబిడ్డ వచ్చారని సమీరా పేర్కొన్నారు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమీరా ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలు తీసుకుని తనకు డెలివరీ చేసిన వైద్యులకు సమీరా కృతజ్ఞతలు తెలిపారు.తనకు అండగా ఉన్న ఫ్యాన్స్ కు సైతం సమీరా కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.2006 సంవత్సరంలో ఆడపిల్ల సీరియల్ తో సమీరా కెరీర్ మొదలైంది.

బుల్లితెర నటుడు ప్రభాకర్ కు జోడీగా సమీరా పలు సీరియల్స్ లో నటించి పాపులారిటీని పెంచుకున్నారు.

ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన పలు సీరియల్స్ ఆమె క్రేజ్ ను రెట్టింపు చేశాయి.సమీరా ప్రముఖ నటి సన కోడలు అనే సంగతి తెలిసిందే.అదిరింది షో తర్వాత బుల్లితెరకు దూరమైన సమీరా ఆ షో నుంచి తనను తొలగించడంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

సమీరా మళ్లీ బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీ కావడంతో పాటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కొడుకు పుట్టడంతో సమీరా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.సమీరా షేర్ చేసిన ఫోటోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube