ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మాట్లాడాలి అన్న బయటకు చెప్పాలి అన్న భయపడే నటీనటులు ఈ మధ్యకాలంలో ఎటువంటి భయం లేకుండా వారికి జరిగిన చేదు అనుభవాల గురించి క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) అనుభవాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడడంతో పాటు నీ వేధింపులకు గురి చేసిన హీరోలు తోటి నటీనటులు డైరెక్టర్లు నిర్మాతల పేర్లు బయట పెట్టేస్తున్నారు.ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా మరో హీరోయిన్ స్పందించింది.ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్( Ratan Raajputh ) గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడిషన్ ఉందంటే ముంబై లోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను.
ఆడిషన్ పూర్తయిన తర్వాత ఒక కోఆర్డినేటర్ వచ్చి డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది.మీటింగ్‌కి సిద్ధమవండి అని చెప్పారు.దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను.వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు.
ఆ తర్వాత మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం అని చెప్పారు.

దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాను.అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది.కొన్ని గంటల తర్వాత ఫోన్ వచ్చింది.
ఒక ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు.తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది.
బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి.ఒక అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది.
ఒక వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు.ఇతడు ఎవరు అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు.
తమ్ముడని అబద్ధం చెప్పాను.ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాము అని తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.