ఈ సీరియల్ నటిని సావిత్రి, సౌందర్యతో పోలుస్తున్నారట.. అసలేమైందంటే..?

బుల్లితెరపై, వెండితెరపై చేసింది తక్కువ సినిమాలే అయినా సీరియల్ నటి నవ్యస్వామి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా కనిపించే నవ్యస్వామి నా పేరు మీనాక్షి, ఆమెకథ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.

 Tv Actress Navya Swamy Fans Comparing Her With Mahanati Savitri And Actress Soundarya-TeluguStop.com

అయితే ఈ బుల్లితెర నటిని కొందరు అభిమానులు ఏకంగా సావిత్రి, సౌందర్యలతో పోలుస్తుండటం గమనార్హం.నవ్యస్వామిని సావిత్రి, సౌందర్యతో పోలుస్తున్న మీమ్స్ సైతం తెగ వైరల్ అవుతున్నాయి.

నవ్యస్వామి ఈ మధ్య కాలంలో పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సీరియల్ నటి ఒక సీరియల్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు సైతం వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

 Tv Actress Navya Swamy Fans Comparing Her With Mahanati Savitri And Actress Soundarya-ఈ సీరియల్ నటిని సావిత్రి, సౌందర్యతో పోలుస్తున్నారట.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఈ సీరియల్ నటికి ఫ్యాన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.సోషల్ మీడియాలో సైతం తరచూ పోస్టులు చేస్తూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

అభిమాని సావిత్రి, సౌందర్యలతో పోల్చిన మీమ్ ను నవ్యస్వామి స్టేటస్ లో పెట్టగా ఆ మీమ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.నెటిజన్ తన్ గ్రాండ్ పేరెంట్స్ సావిత్రి గురించి గొప్పగా చెప్పారని తన పేరెంట్స్ సౌందర్య గురించి గొప్పగా చెప్పారని తాను తన పిల్లలకు నవ్యస్వామి గురించి చెబుతానని నెటిజన్ పేర్కొన్నారు.నవ్యస్వామిని ప్రశంసిస్తూ నెటిజన్ పోస్ట్ చేసిన ఆ మీమ్ ఇతర నెటిజన్లను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సీరియల్ నటి ఫిట్ నెస్ కు కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తారు.

ఈవెంట్లలో గ్లామరస్ గా కనిపించే నవ్యస్వామి బుల్లితెర సీరియల్స్ లో మాత్రం పద్ధతిగా కనిపించడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ అయిన ఈటీవీ, స్టార్ మా ఛానెల్స్ లో ఈ బ్యూటీ ఎక్కువగా సీరియల్స్ చేస్తుండటం గమనార్హం.

#Ravi Krishna #NavyaSwamy #Mahanati #TvActress #Navya Swamy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు