ఆ డైరెక్టర్ తిట్టాడంటున్న బుల్లితెర నటి!  

chaitra rai says director fire on her chitra rai, tv actress, astachemma, akka chellillu, Uday Tv, Kannada, Telugu, Jaya Kumar Reddy, Gopikasi Reddy Govindha - Telugu Akka Chellillu, Astachemma, Chaitra Rai Says Director Fire On Her, Chitra Rai, Gopikasi Reddy Govindha, Jaya Kumar Reddy, Kannada, Telugu, Tv Actress, Uday Tv

బుల్లితెర క్వీన్.మీ తిట్లే మాకు దీవెన‌లంటూ తెగ సంబ‌ర‌ప‌డిపోతుంది.ఎవ‌రైనా తిడితే సంతోష‌ప‌డ‌తారా.? ఇదేం లాజిక్కూ అని తిట్టుకోకండి.మిని కాశ్మీర్ క‌ర్ణాట‌క కూర్గ్ ప్రాంతానికి చెందిన క‌న్న‌డ కుట్టి చైత్ర రాయ్ క‌న్న‌డ‌, తెలుగు బుల్లి తెర పై ఓ వెలుగు వెలిగిపోతుంది.హోట‌ల్ మేనేజ్మెంట్ చ‌దివే స‌మ‌యంలో కాఫీడే లో వ‌ర్క్ చేస్తున్న చైత్ర రాయ్ ను చూసిన క‌న్న‌డ కు చెందిన వెండితెర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను చూసి ఫిదా అయ్యారు.

TeluguStop.com - Tv Actress Chaitra Rai Says Director Fire On Her

తీస్తే ఈమెతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు.అంతే అదే ద‌ర్శ‌క నిర్మాత‌లు ‘చైత్ర రాయ్’తో పాటు మ‌రికొంత‌మంది యాక్ట‌ర్స్ కు యాక్టింగ్ లో మెళుకువ‌లు నేర్పించారు.

సాంగ్స్ రికార్డింగ్ పూర్తి చేసుకున్నారు.కానీ అనేక కార‌ణాల వ‌ల్ల సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్ల‌క‌ ముందే ఆగిపోయింది.

TeluguStop.com - ఆ డైరెక్టర్ తిట్టాడంటున్న బుల్లితెర నటి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే చైత్ర రాయ్ ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే స‌మ‌యంలో ఆమె పాల్గొన్న ఫోటో సెష‌న్స్ మంచి క్లిక్ అయ్యాయి.అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌చ్చి ప‌డ్డాయి.

అలా 2009లో ఉద‌య్ టీవీలో త‌న తొలి క‌న్న‌డ సీరియ‌ల్ కుసుమాంజ‌లి ద్వారా బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది.నాటి నుంచి నేటి వ‌ర‌కు వ‌రుస సీరియ‌ల్స్ లో క‌న్న‌డ, తెలుగులో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.2013 తెలుగు అష్టా చెమ్మా సీరియ‌ల్ లో నెగిటీవ్ క్యార‌క్ట‌ర్ తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి.పాజిటీవ్ వైబ్రేష‌న్ తో అభిమానుల్ని కంట త‌డిపెట్టిచ్చింది.

అలా తెలుగులో ఏడు సీరియ‌ల్స్, రెండు రియాలిటీ షోల‌తో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న ఈ బుల్లితెర క్వీన్ చైత్ర రాయ్.కెరియ‌ర్ ప్రారంభంలో తాను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ను త‌లుచుకొని ఆనందప‌డిపోతుంది.

కెరియ‌ర్ ప్రారంభంలో ఎవ‌రికైనా క‌ష్టాలు కామ‌న్.ముఖ్యంగా నాలాంటి వాళ్లు మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే డైర‌క్ట‌ర్ తో తిట్లు తినాల్సిందే.

అలా తొలి క‌న్న‌డ సీరియ‌ల్ డైర‌క్ట‌ర్ వినుబ‌ళంజ తిట్లు తిని న‌ట‌న‌లో మెళుకువ‌లు నేర్చుకున్న‌ట్లు గుర్తు చేసుకుంటుంది.తెలుగులో యాక్టింగ్, భాష రాక ఇబ్బంది ప‌డుతుంటే డైర‌క్ట‌ర్లు జయకుమార్‌రెడ్డి, గోపికసిరెడ్డి, గోవిందలు త‌న‌కెంతో స‌హ‌క‌రించారంటూ క‌న్న‌డ కుట్టి చైత్ర రాయ్ తెలిపింది.

#Akka Chellillu #ChaitraRai #Astachemma #Chitra Rai #Uday Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tv Actress Chaitra Rai Says Director Fire On Her Related Telugu News,Photos/Pics,Images..