వామ్మో.. ఈ సీరియల్ నటి లగ్జరీ హౌస్ చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి అష్మిత కర్ణని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి, నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది అష్మిత కర్ణని.

 Tv Actress Ashmita Karnani Share Her Home Tour Video , Ashmita Karnani ,home Tour Video , Tv Actress , Serial Actress , Choreographer Sudhir , Home Tour , Tollywood , Serials-TeluguStop.com

బుల్లితెరపై ప్రసారమయ్యే 15 సీరియల్స్ లో నటిస్తోంది.అంతే కాకుండా అప్పుడప్పుడూ మధ్యమధ్యలో సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ లు కూడా చేస్తోంది.

ఇక తెలుగులో సీతామాలక్ష్మీ, మేఘసందేశం, మంజీర మధురం, చి.ల.సౌ.స్రవంతి, మధుమాసం,మధురం, అష్టాచెమ్మ, నిశ్శబ్ధం, ముద్దుబిడ్డ లాంటి సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే అష్మిత కర్ణని కొరియోగ్రాఫర్ సుధీర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Tv Actress Ashmita Karnani Share Her Home Tour Video , Ashmita Karnani ,Home Tour Video , Tv Actress , Serial Actress , Choreographer Sudhir , Home Tour , Tollywood , Serials-వామ్మో.. ఈ సీరియల్ నటి లగ్జరీ హౌస్ చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఈమె తన భర్తతో కలసి స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి షోలో కూడా పాల్గొంది.

ఇకపోతే అష్మిత కర్ణని 2020లో నటనకు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.అయితే ఈమె సీరియల్స్ లో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా అష్మిత కర్ణని తాజాగా హోమ్ టూర్ చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సొసైల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో అష్మిత కర్ణని హోమ్ ఎంతో అద్భుతంగా,లగ్జరిగా వుంది.ఆ వీడియోను చూసిన అభిమానులు ఇళ్ళు సూపర్ గా ఉంది, చాలా బాగుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అష్మిత కర్ణని తన ఇంటీరియర్‌ డిజైన్‌ చూపిస్తూ ఇల్లంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డామంది.తక్కువ స్థలాన్నే అందంగా తీర్చిదిద్ది లగ్జరీ ఇంటిగా మార్చుకున్నామని తెలిపింది.అలాగే డైనింగ్‌ టేబుల్‌, కుర్చీలు బయట కొనకుండా తమ కోసం సెపరేట్‌గా తయారు చేయించుకున్నామని తెలిపింది.అదే విధంగా వారి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కిచెన్‌ను మూసేందుకు వీలుగా ఒక స్లైడింగ్‌ బోర్డ్‌ చేయించుకున్నామంటూ దానిని చూపించింది.

ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం తో పాటుగా, ఇంటీనిండా మొక్కలతో నింపేసింది.అంతేకాకుండా ఆమెకు ఒక బెడ్ రూమ్ తన భర్తకు ఒక బెడ్ రూమ్ కూడా వున్నట్లు తెలిపింది.

అంతే కాకుండా ఆ ఇంట్లోనే చిన్న గదిలో హోమ్‌ థియేటర్‌ కూడా పెట్టుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube