ఐదేళ్ల కుర్రాడి మరణానికి కారణమైన టీవీ నటి, సీరియల్ బృందం?

కొన్ని కొన్ని సార్లు షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి.చాలావరకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.

 Tv Actress And Serial Teem Reason For The Death Of A Five Year Old Boy, Five Yea-TeluguStop.com

అందులో దురదృష్టవశాత్తు కొందరు అన్యాయంగా మరణించిన వాళ్లు కూడా ఉన్నారు.ఇప్పటికే ఎన్నో సినిమా షూటింగ్ సమయంలో హీరోలకు కానీ, హీరోయిన్ లకు కానీ చిన్న చిన్న ప్రమాదాలు వల్ల గాయాలు అవుతుంటాయి.

ఇక కొన్ని సార్లు షూటింగ్ సెట్ లో వాటికి ఏమైనా అంతరాయం కలిగినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.ముఖ్యంగా షూటింగ్ సమయంలో డ్రైవింగ్ కు సంబంధించిన సన్నివేశాలు, మరేదైనా కష్టమైన సన్నివేశాల్లో నటీనటులకు అవగాహన లేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతాయి.

అందులో నటీనటులకే కాకుండా అవతలి వాళ్లకు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇదిలా ఉంటే కొన్ని ఏళ్ళ కిందట ఓ సీరియల్ షూటింగ్ సమయంలో ఓ బుల్లితెర నటి కారు నడపగా యాక్సిడెంట్ అయి ఓ చిన్నారి మృతి చెందగా.

మరో చిన్నారికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.ఇంతకీ ఆ సీరియల్ నటి ఎవరంటే అపర్ణ.

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న నటి.ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.ఇదిలా ఉంటే కొన్ని ఏళ్ళ కిందట ఈమె ఓ సీరియల్ షూటింగ్ సమయంలో ఒక బాలుడి ప్రాణాలు పోయేలా చేస్తుంది.

జెమిని ఛానల్లో ప్రసారమైన ఇంద్రాణి సీరియల్ గతంలో హైదరాబాద్ లోని చందానగర్ లో షూటింగ్ జరుపుకుంది.

ఇక అక్కడ ఈ సీరియల్ షూటింగ్ ను అనుమతి లేకుండా డైరెక్టర్ సన్నివేశాలను చిత్రీకరించగా అందులో అపర్ణతో కారు నడిపే సన్నివేశాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్.కానీ అపర్ణ కు డ్రైవింగ్ లో అంతగా శిక్షణ లేదు.

ఆ సన్నివేశ చిత్రీకరణ సమయంలో అపర్ణ పక్కన మరో డ్రైవర్ కూర్చొని డ్రైవింగ్ చేశాడని తెలిసింది.

Telugu Actress, Appa, Appara, Boy, Indrani Serial, Serial Teem-Movie

ఇక ఆ సమయంలో కారు అదుపు తప్పడంతో అక్కడే ఉన్న ఓ పార్కులోకి దూసుకెళ్లింది.అదే సమయంలో ఆ పార్కులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కి కారు వెళ్ళింది.దీంతో వెంటనే ఆ చిన్నారులను హాస్పిటల్ కు తరలించారు.

కానీ అప్పటికే 5 ఏళ్ల వయసున్న సాత్విక్ రెడ్డి అనే బాలుడు మరణించాడు.ఇక మరో సాత్విక అనే అమ్మాయికి కూడా గాయమవడంతో తనకు కాలు, చెయ్యి ఫ్యాక్చర్ అయింది.

ఇక అపర్ణ పై, డైరెక్టర్ పై, ప్రొడక్షన్ మేనేజర్ పై అంతేకాకుండా కారులో అపర్ణ పక్కన ఉన్న డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఇక అపర్ణ అనుకోకుండా కారు అదుపు తప్పిందని వెంటనే తనకు కళ్ళు తిరగడంతో కింద పడిపోయానని తెలిపింది.

ఇక తన తప్పేమీ లేదని తప్పు లేకున్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి వారికి పరిహారం ఇవ్వడానికి సిద్ధమని తెలిపింది అపర్ణ.

ఇక ఆ చిన్నారి తల్లిదండ్రులు అపర్ణ పై బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనది తప్పులేదని కావాలంటే డబ్బులు ఇస్తానని అనడంతో ఆ తల్లిదండ్రులు చాలా బాధ పడ్డారు.ఇదంతా గతంలోనే జరిగింది.

ఆ తర్వాత మెల్ల మెల్లగా ఈ కేసు కూడా కొట్టివేయబడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube