ఆ పాట విని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఎందుకంటే..?  

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈటీవీ, జీ తెలుగు ఛానల్స్ లోని ప్రోగ్రామ్ లకు యాంకర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా బుల్లితెరపై సత్తా చాటుతున్నారు.

TeluguStop.com - Tv Achor Anasuya Emotional In Atto Attamma Kuturo Program

అదే సమయంలో ఈవెంట్లలోనూ పాల్గొంటూ అనసూయ సందడి చేస్తున్నారు.ఈరోజు ఈటీవీ ఛానెల్ లో ప్రసారమైన అత్తో అత్తమ్మ కూతురో ప్రోగ్రామ్ లో అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే అనసూయ మధుప్రియ పాడిన పాట విని కన్నీళ్లు పెట్టుకున్నారు.స్టార్ సింగర్ మధుప్రియ ఈ ఈవెంట్ లో “కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరు అయ్యే దేవుడా” అని అబార్షన్ల గురించి పాట పాడారు.

TeluguStop.com - ఆ పాట విని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ పాట వినగానే యాంకర్ అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నారు.అబార్షన్ల గురించి మధుప్రియ పాడిన ఈ పాట విని ఈవెంట్ లో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం ఎమోషనల్ అయ్యారు.

పండుగ సందర్భాల్లో, ప్రత్యేక రోజుల్లో ఈటీవీ ఛానల్ ఏదో ఒక ఈవెంట్ ను నిర్వహిస్తూ ఉంటుంది.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈరోజు అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్ ను ఈటీవీ ప్రసారం చేసింది.మరోవైపు అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.రవితేజ ఖిలాడీ సినిమాలో ఇప్పటికే అనసూయకు ఛాన్స్ దక్కినట్టు తెలుస్తుండగా మమ్ముట్టి సినిమాలో కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారని సమాచారం.

గతంలో మమ్ముట్టి నటించిన యాత్ర సినిమాలో చిన్న పాత్రలో అనసూయ నటించారు.తమిళంలో కూడా అనసూయ ఒక సినిమాలో నటిస్తున్నారు.

సాధారణంగా పెళ్లైతే యాంకర్లు, హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయి.అయితే పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ వరుస అవకాశాలతో బిజీగా ఉండటం గమనార్హం.

తెలుగులో అనసూయ నటించిన సినిమాలు హిట్లు కాగా ఇతర ఇండస్ట్రీల్లో కూడా అనసూయ సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.

#MalayalamStar #EmotionalIn #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు