సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన టీవీ9 సీ ఎఫ్ వో

గత రెండు రోజులుగా టీవీ 9 కార్యాలయాల్లో సైబరాబాద్ పోలీసు లు తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.టీవీ 9 సిఈఓ పదవి నుండి రవి ప్రకాష్ ని తప్పిస్తూ ఏబీసీఎల్ ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్రావు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 Tv 9 Cfo Attended To The Cyber Crime Police For Investigation-TeluguStop.com

దానితో రవి ప్రకాష్ ఫోర్జరీ కి పాల్పడ్డారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం తో పోలీసులు ప్రస్తుతం రవి ప్రకాష్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు.అయితే తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్ ఓ ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి విచారణ కోసం హాజరైనట్లు తెలుస్తుంది.

నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్లు, నాలుగు ల్యాప్టాప్ లు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

టీవీ 9 సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్ వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో వారి ముగ్గురికి కూడా సైబర్ పోలీసులు నోటీసులు జారీ చేయగా సి ఎఫ్ వో మూర్తి మాత్రం పోలీసుల ముందు విచారణ కు హాజరయ్యారు.

అయితే రవి ప్రకాశ్, శివాజీలు కూడా విచారణకు రావాల్సింది గా నోటీసులు జారీ చేయగా అయితే ఇప్పడూ వారు నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube