హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టవచ్చు తెలుసా.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి చాలు!

పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషిని మరింత ముందుకు నడిపిస్తోంది.అదే క్రమంలో కొన్ని వెనక్కిలాగే అంశాలు వున్నాయి.

 Turn On Google Play Protect To Save Your Android Mobile From Malicious Apps And-TeluguStop.com

ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని వారి ఆయుధంగా మలుచుకుంటున్నారు.అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.

డబ్బుని కాజేస్తున్నారు, విలువైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు.ఇది ఒక ప్రధాన సమస్యగా మరిణమించడంతో పలు కంపెనీలు వారికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తున్నాయి.

అందులో గూగుల్ ప్రధానమైనది.గూగుల్ తన యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా కస్టమర్ల ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి Google వివిధ రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న సంగతి తెలిసినదే.అయితే ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ ప్రవేశపెట్టినా, వివిధ భద్రతా చర్యలపై గట్టి పట్టు ఉన్నా.

కొన్నిసార్లు కొన్ని హానికరమైన సైబర్ దాడులను ఆపలేకపోతున్నారు.అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు Google Play Protect అనే సెక్యూరిటీ సెట్టింగ్‌ను ఆన్‌లో ఉంచాలని ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ సలహా ఇస్తుంది.

Google Play Protect అనేది గూగుల్ అందించే ఫ్రీ సెక్యూరిటీ సర్వీస్.కస్టమర్లు ఏవైనా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, ఇది వాటిని తనిఖీ చేస్తుంది.యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ముందే ప్లే ప్రొటెక్ట్, గూగుల్ ప్లే స్టోర్ యాప్స్‌పై సెక్యూరిటీ చెక్ రన్ చేస్తుంది.

Telugu Android, Google Protect, Hackers, Improveharmful, Apps, Phone, Ups-Latest

డివైజ్‌లో ఇతర సోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ప్రమాదకరమైన యాప్స్ ఉన్నాయేమో తనిఖీ చేస్తుంది.మీరు “Improve harmful app detection” సెట్టింగ్‌ను ఆన్ చేస్తే, అన్‌-నోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆటోమెటిక్‌గా గూగుల్‌కు సెండ్ చేస్తుంది.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఇలా ఆన్ చేసుకోండి.

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ ఓపెన్ చేయండి.తరువాత టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసి, సెట్టింగ్స్‌కు వెళ్లండి.ఇక్కడ కనిపించే “Improve harmful app detection” సెట్టింగ్‌ను ఆన్ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube