బీజేపీ ఎంపీ రాజీనామా చేయాలంటూ రైతుల డిమాండ్

తెలంగాణ బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలంటూ ఓ డిమాండ్ తెరమీదకు వచ్చింది.పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్ ఇప్పుడు మాట మార్చడంపై రైతులు మండిపడుతున్నారు.

 Turmeric Board Farmers Demands Mp Aravind Resignation-TeluguStop.com

గతంలోనే ఈ విషయంపై స్పందించిన అరవింద్ పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా తాను ప్రయత్నిస్తున్నాని, పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి ప్రయోజనాలు చేకూరేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని అరవింద్ చెప్పారు.

ఇదే విషయంపై ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు సాధ్యం కాదని, రైతులకు లాభాలు వచ్చేలా తాను తగిన చర్యలు తీసుకుంటానన్నారు.

ఈ ప్రకటనపై కొంతమంది రైతులు మండిపడ్డారు.రైతుల సంక్షేమం పై అంత చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి రైతుల కోసం పోరాడి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంటూ రైతులు డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు తాను ఎంపీగా గెలిపిస్తే గెలిచినా ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తాను అంటూ బ్యాండ్ పేపర్ మీద రాసిచ్చారని, ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube