ఫన్నీ ఇన్సిడెంట్..తప్పతాగి తనని తానే వెతుకున్న వ్యక్తి!

తాజాగా టర్కీలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.ఈ ఇన్సిడెంట్ వింటే మీరు కూడా పగలబడి నవ్వడం ఖాయం.

 Turkish Man Searches For Himself After Going Missing Funny Incident, Viral News,-TeluguStop.com

ఒక వ్యక్తి స్నేహితులతో కలిసి పీకలదాకా తాగి కనిపించకుండా పోయాడు.దీంతో స్నేహితులు పోలీసులకు చెప్పగా వారు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసారు.

అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది.ఆ వ్యక్తి కూడా పోలీసులతో కలిసి తనని తానే వెతుక్కోవడం స్టార్ట్ చేసాడు.

ఈ విషయం చివరిగా పోలీసులకు చెప్పడంతో వారు కూడా షాక్ అయ్యారు.ఈ ఫన్నీ ఘటన టర్కీలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.50 ఏళ్ల బెహన్ ముట్లు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మందు కొట్టాడు.ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి పక్కనే ఉన్న సయ్యాక అనే గ్రామీణ ప్రాంతానికి వెళ్లారు.కానీ అలా వెళ్తున్న ముట్లు కనిపించకుండా పోయాడు.

అతడు మద్యం మత్తులో అక్కడే ఉన్న అడవిలోకి వెళ్ళాడు.ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళాడు.

ముట్లు స్నేహితులు కందరు పడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు విచారణ చేపట్టారు.

ఆ అడవిలో వెతకడానికి వెళ్లగా అక్కడే ముట్లు కూడా పోలీసుల బృందంలో కలిసి పోయాడు.వాళ్లతో పాటే తిరిగాడు.అసలు పోలీసులు ఎవరిని వెతుకుతున్నాడో కూడా తెలియకుండానే వాళ్లతో పాటు తనని తాను వెతుకున్నాడు.

పోలీసులు కూడా పక్కనే గ్రామంలో ఉండే వ్యక్తి ఏమో తమకు సహాయం చేస్తున్నాడేమో అనుకుని పట్టించుకోలేదు.చివరకు పోలీసులు ముట్లు ఎక్కడున్నావ్.అని గట్టిగట్టిగా కేకలు వేయడంతో ముట్లు తగినదంతా దెబ్బకు దిగిపోయింది.దీంతో వెంటనే పోలీసులను మీరు ఎవరిని వెతుకుతున్నారు.

అని అడగగా వాళ్ళు ముట్లు ను వెతుకుతున్నామని చెప్పారు.

దీంతో ముట్లు వెంటనే నేనే మీరు వెతుకుతున్న ముట్లు అంటూ పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు.అతడి కోసం అతడే గాలించడం అందరికి నవ్వు తెప్పిస్తుంది.ఇక పోలీసులు కూడా చేసేది ఏమి లేక అతడిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు.

ముట్లు స్నేహితులకు విషయం చెప్పగానే వాళ్ళు పగలబడి నవ్వరాట.సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటో రావడంతో ఇది విన్న నెటిజెన్స్ కూడా నవ్వుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube