చిన్నారి క్యాన్సర్‌ పేషేంట్లను అద్భుతంగా ట్రీట్‌ చేస్తున్న హాస్పిటల్‌... హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు!

నేటి దైనందిత జీవితంలో అనేక రకాల అరుదైన వ్యాధులు మనుషులను కబళిస్తున్నాయి.అందులో క్యాన్సర్‌ ఒకటి.

 Turkish Hospital Uses Toy Cars To Drive Children Suffering From Cancer Details,-TeluguStop.com

ఒకప్పుడు క్యాన్సర్‌ వ్యాధి చాలా అరుదుగా ఉండేది.కానీ ఇపుడు క్యాన్సర్‌ పేషేంట్లు వూరు, వాడా అనే తేడాలేకుండా అన్ని చోట్లా దీనితో బాధపడుతున్నవారు మనకు తారసపడుతూ వుంటారు.

దీనికి కారణం ముఖ్యంగా ఆహారం అని నిపుణులు చెబుతూ వున్నారు.ఇక అభం శుభం తెలియని చిన్నారులను సైతం క్యాన్సర్‌ వదలడంలేదు.

ఆ పసితనంలోనే వారు కీమో, రేడియేషన్ థెరపీల కోసం హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందంటే అంతకంటే పెద్ద నరకం ఇంకొకటి ఉండదు.

Telugu Awareness, Cancer, Toy Cars, Turkish, Latest-Latest News - Telugu

ఇంజక్షన్ అంటేనే భయపడిపోయే చిన్నారులకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అంటే ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదా.అందుకే వారికోసం బొమ్మ కార్లను ఏర్పాటు చేసింది ఓ హాస్పిటల్ యాజమాన్యం.అవును, టర్కిష్ హాస్పిటల్, క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను చికిత్స కోసం తీసుకెళ్లడానికి బొమ్మ కార్లను ఉపయోగించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఎందుకంటే సదరు ట్రీట్మెంట్ అంటే వారిలో భయాందోళనలు ఉంటాయి.వాటిని పోగొట్టడానికే ఇలా ఆ యాజమాన్యం ఓ వినూత్న ప్రయత్నం చేపట్టింది.

Telugu Awareness, Cancer, Toy Cars, Turkish, Latest-Latest News - Telugu

ఇపుడు ఆ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు చికిత్స గదికి వెళ్లడానికి బెలూన్‌‌లు కట్టిన ఎలక్ట్రిక్ టాయ్ కార్లను నడుపుకుంటూ వెళ్లడం గమనార్హం.ఇంతకీ ఆ హాస్పిటల్ ఎక్కడుందంటే టర్కీ నగరంలోని కలదు.అక్కడ కైసేరిలోని ఒక ఆసుపత్రిలో, క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు వారి చికిత్స గదికి వెళ్లడానికి స్ట్రెచర్‌కు బదులుగా మినీ బ్యాటరీతో నడిచే కార్లను ఏర్పాటు చేయడం ఇపుడు స్థానికంగా హాట్ టాపిక్ అయింది.ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మూసా మాట్లాడుతూ, కొన్నిసార్లు పిల్లలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు టోమోగ్రఫీ, MRI స్కాన్ల కోసం పంపుతాము.

ట్రీట్‌మెంట్‌కి వెళ్లడం ఇష్టం లేని పిల్లలు ఇప్పుడు రైడ్‌ ఆన్‌ కార్‌ ఎక్కి సంతోషంగా వెళుతున్నారు… అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube