వావ్.. గాలిలో ఎగురుతూ ఉల్లిపాయలు కట్ చేసిన 'స్మైలీ చెఫ్'..!

ఆడవాళ్లకు వంట ఇంటికి అవినాభావ సంభంధం ఉంటుంది.అయితే ఈ మధ్య మగవారు కూడా మేము ఏం తక్కువ కాము అని వంటల్లో ఆడవాళ్లకు పోటీ ఇస్తున్నారు.

 Turkeys Smiling Chef Cuts Onion Aboard A Flying Vehicle-TeluguStop.com

మగవాళ్ళతో ఫేమస్ చెఫ్స్ చాలా మందే ఉన్నారు.టర్కీ కి చెందిన ఫేమస్ చెఫ్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది.

తరచు సోషల్ మీడియా చూసే వారికీ ఇతని గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Turkeys Smiling Chef Cuts Onion Aboard A Flying Vehicle-వావ్.. గాలిలో ఎగురుతూ ఉల్లిపాయలు కట్ చేసిన స్మైలీ చెఫ్’..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే సోషల్ మీడియాలో గడిపే వారికీ ఇతడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియోలో చూసే ఉంటారు.

ఈ ఫేమస్ చెఫ్ పేరు బురాక్ ఓజెడిమిర్.అందరు ఇతన్ని స్మైలీ చెఫ్ అని ముద్దుగా పిలుస్తారు.ఎందుకంటే ఇతడు అన్ని వీడియోల్లో వంటలను నవ్వుతూనే చేస్తాడు.అస్సలు స్మైల్ మిస్ అవ్వడు.

వంట వైపు చూడకుండా కేవలం కెమెరా వైపు మాత్రమే చూస్తూ నవ్వుతూనే వంటను పూర్తి చేస్తాడు.

తాజాగా ఇతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఏం చేసాడంటే ఇతడు హెలికాఫ్టర్ లో కూర్చుని ఉల్లిపాయలు కట్ చేసాడు.మనం మాములుగా ఇంట్లో వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేయడానికి నానా కష్టాలు పడతాము.

కానీ ఇతడు కదులుతున్న హెలికాఫ్టర్ లో వెళుతూ ఉల్లిపాయలను చకచకా కట్ చేసాడు.అంత ఎత్తులో గాలిలో కదులుతున్న హెలికాఫ్టర్ లో ఉల్లిపాయలను కట్ చేయడం అంటే మాటలా.

కానీ ఈ చెఫ్ మాత్రం అవలీలగా కట్ చేసి అవతల పడేసాడు.ఎప్పుడు వంట ఎలా చూడకుండా చేస్తాడో అలానే ఉల్లిపాయలను కూడా చూడకుండానే కదులుతున్న హెలికాఫ్టర్ లో కూర్చుని టకాటకా కట్ చేసాడు.ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎగిరే ఉల్లిపాయలంటే మీకు ఇష్టమేనా అని ఆ వీడియోను పోస్ట్ చేసాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీరు కూడా చూసేయండి.

#Vehicle #Turkey Chef #TurkeysChef #Chef

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు