మాకెవ్వరూ అల్టిమేటం ఇవ్వలేరు

మాకెవ్వరూ అల్టిమేటం ఇవ్వలేరు అంటూ టర్కీ రక్షణ మంత్రి హులూసి ఆకర్ వ్యాఖ్యానించారు.రష్యా నుంచి టర్కీ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని భావించింది.

 Turkey Rejects U S Ultimatum-TeluguStop.com

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా టర్కీ కి అల్టిమేటం జారీ చేసింది.రష్యా నుంచి ఆ క్షిపణులను కొనుగోలు చేయకూడదు అంటూ అల్టిమేటం జారీ చేసింది.

దీనితో స్పందించిన టర్కీ అమెరికా ఇచ్చిన అల్టిమేటం ను నిర్మొహమాటంగా తోసిపుచ్చింది.ఈ విధంగా మాకు అల్టిమేటం జారీ చేయడం తగదని టర్కీ రక్షణ మంత్రి హులూసి అకర్‌ అన్నారు.

అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్‌ షన్‌హన్‌ గత వారం టర్కీకి ఒక లేఖరాస్తూ రష్యా నుండి ఎస్‌-400 వ్యవస్ధ కొనుగోలును విరమించుకోవాలని లేనిపక్షంలో ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌పై టర్కీ పైలెట్లకు ఇస్తున్న శిక్షణను నిలిపివేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే,
.

-Telugu NRI

అయితే ఆ లేఖ పై స్పందించిన టర్కీ అమెరికా రాసిన లేఖ నాటో స్ఫూర్తికి అనుగుణంగా లేదని , అందులో వాడిన పదజాలం తగినవిధంగా లేదని టర్కీ రక్షణ మంత్రి హులుసి అమెరికాకు స్పష్టం చేశారు.తమకు ఎవరూ అల్టిమేటం ఇవ్వలేరని ఈ సందర్భంగా టర్కీ స్పష్టం చేసింది.అమెరికా గతంలో కూడా భారత్ కు ఇలాంటి హెచ్చరికలే జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అనంతరం ఈ విషయం లో భారత్ పై మాత్రం అమెరికా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు.T

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube