'తుమ్మల ' డిసైడ్ అయిపోయారా ? 'కారు ' కి టాటా ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగిలేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన చాలామంది నేతలు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

 Tummala Nageswara Rao, Trs, Congress, Paleru Constancy,  Khammam District, Congr-TeluguStop.com

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దగ్గర  నుంచి మిగతా పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఎప్పటికైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మంచి ప్రాధాన్యం దక్కుతోంది అనే ఆలోచనలో ఉన్నారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు.  ముందుగా ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడిగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్నారు.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందారు.అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉంటున్నారు.

తమకు తగిన ప్రాధాన్యం టిఆర్ఎస్ లో దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.దీనికి తోడు పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరావు పై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్రెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యం మరింతగా తగ్గింది.

దీనికితోడు ఉపేందర్ రెడ్డి సైతం తుమ్మల నాగేశ్వరావు ప్రభావం పెద్దగా లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆయన వ్యతిరేక వర్గంను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండటం తదితర కారణాలతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Telugu Congress, Congress Mla, Kandalaupender, Khammam, Revanth Reddy-Telugu Pol

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో ఆయన రహస్య చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.త్వరలోనే ఆయన పార్టీ మారే విషయమై బహిరంగ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.తుమ్మల పార్టీ మార్పును బలపరిచే విధంగా ఆయన కుమారుడు ఓ బహిరంగ సభ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని చెబుతూనే స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పై సంచలన విమర్శలు చేశారు.ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని నాగేశ్వరావు  కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube