వైరల్.. ఏనుగు కిడ్నాప్.. 40 లక్షలకు బేరం.. చివరికి ట్విస్ట్ అదిరింది!

మన దేశంలో రోజు రోజుకూ క్రైమ్ రేట్ పెరుగుతూ పోతుంది.పొరుగు వాళ్లపై కోపంతో కిడ్నాప్ లు, వంద రూపాయల కోసం కిడ్నాప్ వంటివి  ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి.

 Tumakuru Mutt Blames Karnataka Forest Department Over Elephant Abduction Details-TeluguStop.com

చిల్లర  దొంగల నుండి పెద్ద పెద్ద దొంగతనాలు చేసే దొంగల గురించి వినే ఉంటాం.కానీ ఏనుగును కిడ్నాప్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.

అయితే ఇప్పుడు మాత్రం ఏనుగును కిడ్నాప్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమాలో జరిగినట్టు అంతా ఒక డ్రామా లాగా సాగిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

ఏనుగును కిడ్నాప్ చేసిన ముఠాలో ఫారెస్ట్ అధికారులు కూడా చేతులు కలిపారు.ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

బెంగుళూరు కు 70 కిలో మీటర్ల దూరం లోని తుమకూరు జిల్లా కేంద్రంలో గల కరిబసవస్వామి మఠానికి చెందిన లక్ష్మి అనే ఏనుగు ఇటీవల కిడ్నాప్ అయ్యింది.

ఈ ఘటన కు సంబంధించి ఫారెస్ట్ అధికారులను సహ నిందితులుగా పేర్కొంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

కరిబసవస్వామి మఠానికి వచ్చే చిన్న పిల్లలను సైతం ఆత్మీయంగా ఆశీర్వదించే లక్ష్మి అనే ఏనుగును అపహరించాలని ఒక సర్కస్ కంపెనీ నిర్వాహకులు భారీ వ్యూహాన్ని రచించారు.ప్రొఫెషనల్ కిడ్నపర్లు వెటర్నటీ డాక్టార్ల వేషంలో మఠాన్ని సందర్శించారు.

Telugu Elephant, Forest, Karnataka, Tumakuru, Tumakurumutt-Latest News - Telugu

మఠం నిర్వాహకులతో మాట కలిపి ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించి, దాని కడుపులో గడ్డ ఉందని వెంటనే తొలగించకపోతే ప్రాణాలకే ముప్పు అని నమ్మించి ఆపరేషన్ కోసం తమతో పంపేలా ఒప్పించారు.మఠం నిర్వాహకులు నిజం అనుకుని వారితో తరలించేందుకు అంగీకరించారు.ఆసుపత్రికి తీసుకు వెళ్తాము అని చెప్పి మధ్యలోనే దారి మళ్లించి ఏనుగుతో వచ్చిన వారిని తన్ని లారీ దింపేసి ఎవరికీ తెలియకుండా ఆ ఏనుగును ఒక గ్రామంలో దాచి ఉంచారు.

Telugu Elephant, Forest, Karnataka, Tumakuru, Tumakurumutt-Latest News - Telugu

ఆ తర్వాత గుజరాత్ తరలించాలని వారి ప్లాన్.మఠం నిర్వాహకులు నిజం తెలుసుకుని అడుగడుగు గాలించి ఏనుగును గుర్తించి మళ్ళీ మఠానికి మళ్లించారు.ఏనుగును కిడ్నాప్ చేసేందుకు 40 లక్షల రూపాయలకు భేరం కుదుర్చుకుని రంగంలోకి దిగారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

ఈ కుట్రలో గుజరాత్ దొంగలకు కర్ణాటక ఫారెస్ట్ అధికారులు కొంతమంది సహకరించారని తెలుస్తుంది.వారు ఏదో చేయాలనీ అనుకుంటే చివరకు ఇంకేదో అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube