తులసి మొక్కను ఈ విధంగా వాడితే దురదృష్టమే..!

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు.ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకు తులసి దర్శనమిస్తుంది.

 Curse Of Tulasi Mata Story, Tulsi Leaves, Jalandhara,lord Shiva, Vinayaka, Tulsi-TeluguStop.com

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ తులసి మొక్కకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.ఈ తులసి మొక్కను దైవ సమానంగా భావిస్తారు.

అదే విధంగా ఆరోగ్యపరంగా తులసి ఎంతో ముఖ్యమైనది.పూర్వ కాలం నుంచి ఈ తులసి మొక్కను ఎన్నో ఆయుర్వేద మూలికలలో ఉపయోగిస్తున్నారు.

ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కను ఉపయోగించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.కానీ నియమాలకు విరుద్ధంగా పాటించటం వల్ల మనకు బాధలు తప్పవని పండితులు తెలియజేస్తున్నారు.

అయితే తులసి మొక్కను ఏ విధంగా ఉపయోగించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంటి ముందు తులసి కోటకు ప్రతి రోజు పూజ చేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని భావిస్తారు.

అయితే ఈ తులసి ఆకులతో పొరపాటున కూడా పరమేశ్వరుడికి పూజ చేయకూడదు.ఈ విధంగా తులసి ఆకులతో శివుడికి పూజ చేస్తే తులసి మాత ఆగ్రహానికి గురికావడం వల్ల ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.

జలంధరుడు అనే రాక్షసుడు తులసి మాత భర్త.జలంధరుడు చనిపోవడానికి కారణం శివుడు కావడంతో ఎంతో ఆగ్రహానికి గురైన తులసి తన మాలతో ఆ పరమశివుడిని పూజించకూడదని శాపం పెడుతుంది.

అదే విధంగా తులసి మాలతో వినాయకుడిని కూడా పూజించకూడదు.అదే విధంగా పండుగలు, ప్రత్యేకమైన రోజులలో తులసి ఆకులను తుంచకూడదు.

ఆదివారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య రోజులలో తులసి ఆకులను తుంచకూడదని పండితులు చెబుతున్నారు.అదే విధంగా తులసి మొక్కను ఎప్పుడు కూడా ఇంటి ఆవరణంలో ఉంచుకోవాలి.

పొరపాటున ఇంటిలోపల ఉంచుకోకూడదు.తులసి కోటకు ఎల్లప్పుడు నియమనిష్టలతో పూజ చేయటం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి అనుగ్రహించి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు.

తులసి మొక్క ఏ ఇంటిలో అయితే ఎండి పోతుందో ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని సంకేతం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube