వైరల్ ఫీవ‌ర్‌ ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు       2018-06-07   01:05:24  IST  Lakshmi P

సీజన్ మరేటప్పటికీ వైరల్ ఫీవ‌ర్‌ లు వచ్చేస్తూ ఉంటాయి. వాతావరణంలో సడన్ గా మార్పులు రావటం,దోమలు కుట్టటం,ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు వంటి కారణాలతో వైరల్ జ్వరాలు వాస్తు ఉంటాయి. వైరల్ జ్వరాలు తగ్గటానికి డాక్టర్ ఇచ్చిన మందులతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను కూడా పాటిస్తే తొందరగా తగ్గటమే కాకుండా జ్వరం కారణంగా వచ్చే నీరసం కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

ధనియాల టీ

ధనియాలలో యాంటీ బయోటిక్ గుణాలు ఉండుట వలన జ్వరం తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి త్రాగాలి. అవసరం అనుకుంటే ఈ ధనియాల టీలో పాలు, పంచదార కూడా వేసుకోవచ్చు. ధనియాల టీ వైరల్ జ్వరం నుండి తొందరగా ఉపశమనం కలిగేలా చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

-

తులసి ఆకులు

ఒక లీటర్ నీటిలో 20 తులసి ఆకులు, కొంచెం లవంగాల పొడి వేసి ఆ నీరు అర లీటర్ అయ్యేవరకు మరిగించాలి. ఆ నీటిని త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెండు గంటలకు ఒకసారి త్రాగాలి. తులసి,లవంగాల పొడిలో ఉన్న లక్షణాలు జ్వరం తీవ్రతను తగ్గిస్తాయి.

మెంతులు

ఒక టేబుల్ స్పూన్ మెంతులను కొంత నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వేరు చేసి తాగాలి. ప్రతి 3 గంటలకు ఓసారి ఈ ద్రవం తాగితే ఫలితం ఉంటుంది.