డెమోక్రటిక్ పార్టీని ఇబ్బంది పెట్టిన తులసీ గబ్బార్డ్ నిర్ణయం

అమెరికా అధ్యక్షుడిని గద్దె దించే క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ కలిసి ట్రంప్ పై రెండు అభిశంసనలు పెట్టిన విషయం విదితమే.ట్రంప్ తన అధికారాని దుర్వినియోగం చేశారని, ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ తరుపున తనకి ప్రత్యర్ధిగా పోటీకి నిలబడుతున్న జో బిడెన్ పై అవినీతి ఆరోపణలు చేయించడానికి ఉక్రెయిన్ తో చేతులు కలిపారని, అమెరికన్ కాంగ్రెస్ ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిచారని రెండు అభియోగాలు అభిశంసనలో ప్రవేశపెట్టారు.

 Tulsi Gabbard Surprise Movie Over Votes Present On Trump-TeluguStop.com

ఈ అభిశంసన స్వీకరించిన ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ట్రంప్ పై అభిశంసన కి ఆదేశిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.అంతేకాదు అభిశంసన పై ఓటింగ్ కూడా ప్రవేశపెట్టారు.

ఈ ఓటింగ్ లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధిక ఓట్లు పోలయ్యాయి.దాంతో అభిశంసన ప్రక్రియని సెనేట్ లో ప్రవేశ పెట్టారు.

ఇక సెనేట్ తీసుకునే చర్యలపై ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Telugu Page, Favor, Tulsi Gabbard, Votes Trump-

డెమోక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన అభిశంసన ప్రక్రియలో అందరూ ట్రంప్ కి వ్యతిరేకంగా ఓటు వేయగా కొంతమంది మాత్రం ట్రంప్ కి మద్దతు తెలిపారు.అయితే అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలో నిలిచిన భారత సంతతి మహిళ తులసీ గబార్డ్ సైతం ట్రంప్ పై వ్యతిరేక ఓటు వేయలేదు.ఆమె తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.

అయితే తులసీ తీసుకున్న నిర్ణయం డెమోక్రటిక్ పార్టీ నేతలకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube