ట్రంప్ టార్గెట్ గా 'తులసి' ప్రచారం షురూ  

Tulsi Gabbard Officially Launches 2020 Us Presidential Campaign-

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈ సారి ఇద్దరు భారత సంతతి మహిళలు అయిన కమలా హరీస్ , తులసి గబ్బార్డ్ లు పోటీ పడుతున్న విషయం అందరికి తెలిసింది. ఇప్పటికే కమలా తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలని ఆకట్టుకునే విధంగా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అమెరికా ప్రజలు సైతం ఆమె ప్రచారానికి మద్దతు తెలుపుతున్నారు..

ట్రంప్ టార్గెట్ గా 'తులసి' ప్రచారం షురూ -Tulsi Gabbard Officially Launches 2020 US Presidential Campaign

కమలా తరువాత అదే స్థాయిలో పోటీ పడుతున్న తులసీ గబ్బార్డ్ తన ప్రచారాన్ని తాజాగా ప్రారంభించారు. అధికారికంగా తానూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టుగా ప్రకటించిన ఆమె స్వదేశంలో, విదేశాల్లో శాంతిస్థాపన దిశగా ఉద్యమించేందుకు నాతో చేతులు కలపండి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ప్రతీ ఒక్కరికి స్వేచ్చా , న్యాయం , సమానత్వం కావాల్సిందే అందుకు గాను అమెరికా కట్టుబడి ఉంటుంది.నేటి నుంచీ ఈ దిశగా కృషి చేస్తాను అంటూ తులసి తన ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపారు. అంతేకాదు మొదటి రోజునే ట్రంప్ పై విమర్శలు గుప్పించారు.అయితే తులసి పై హిందుత్వ వాదిగా కొందరు ముద్ర వేయడం ఆమెకి అంతగా కలిసి రాకపోవచ్చు అంటున్నారు పరిశీలకులు..