అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి...భారతీయ హిందూ మహిళ..  

Tulsi Gabbard For President 2020-nri,tulsi Gabbard

అమెరికాలో భారతీయుల హవా ఇప్పటికే మారుమోగిపోతోంది.ఎన్నో కీలకమైన పదవులలో..

అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి...భారతీయ హిందూ మహిళ..-Tulsi Gabbard For President 2020

అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు అమెరికాలో ఓ వెలుగు వెలుగుతున్నారు.అయితే ఇప్పుడు ఏకంగా ఒక భారతీయ హిందూ మహిళ అమెరికా కాంగ్రెస్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది.ఎందుకంటే అమెరికా కాంగ్రెస్ లో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ ఆమె ఒక్కత్తే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి డెమోక్రటిక్ పార్టీ తరుపున ఆమె పోటీ చేయనున్నారు…వివరాలలోకి వెళ్తే.

ఆమె పేరు తుల్సీ గబార్డ్‌ 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుల్సీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు గత శుక్రవారం లాస్‌ ఏంజి ల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ భారత-అమెరికన్‌ డాక్టర్‌ సంపత్‌ శివంగి తెలిపారు అయితే ఆ సమయంలో తుల్సీ అక్కడే ఉన్నా ఆ వ్యాఖ్యలు ఖండించక పోవడంతో ఈ విషయం నిజమేనని ఒక క్లారిటీ కి వచ్చారు.

అయితే ఒకవేళ తుల్సీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే తొలి హిందూ అభ్యర్థి అవుతారు. అంతేగాకుండా…ఒకవేళ 2020 ఎన్నికల్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా ఆమె రికార్డులకి ఎక్కుతారు.తాజాగా తుల్సీ నాలుగో సారి ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు…ఇదిలాఉంటే ట్రంప్ సైతం మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు.ఈ లెక్కలో వచ్చే ఎన్నికల్లో భారతీయ సంతతి వ్యక్తుల మద్దతు తుల్సీ కి భారీ స్తాయిలో ఉండబోతోందని తెలుస్తోందని భావిస్తున్నారు విశ్లేషకులు.2 Attachments