తులారాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?  

  • తులా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో,వారిగుణగణాలు,వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారి ప్రేమలో స్వార్ధం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. వీరు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు. తులా రాశి వారు జీవిత భాగస్వామికి ఎంత విలువ,ప్రేమను ఇస్తారో అదే విధంగా స్నేహితులకు,బందువులకు,కుటుంబ సభ్యులకు కూడా అంతే విలువను ఇస్తారు. ఇది జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్ధం చేసుకోవాలి. లేకపోతే వారి మధ్య అపోహలు,కలతలు వచ్చే అవకాశం ఉంది.

  • -

  • తులా రాశి వారు తన చుట్టూ ఉన్నవారితో తొందరగా మాటలు కలిపి అందరితో కలిసి పోతారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎప్పుడు కొత్త కొత్త స్నేహితులు,పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. తుల రాశి వారు అందరితో తొందరగా కలిసి పోతారు. వీరికి కొత్త కొత్త పరిచయాలు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

  • వీరికి స్నేహితులు ఎక్కువగా ఉండుట వలన జీవిత భాగస్వామికి సమయాన్ని తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి కాస్త అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. వీరు పది మందితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం వలన మనస్తత్వాన్ని కూడా వెంటనే పసిగట్టేస్తారు.

  • వీరికి కళా రంగం,సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే తులా రాశి వారు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. తులారాశి వారికీ,వారి జీవిత భాగస్వామికి ఏమైనా గొడవలు వచ్చినప్పుడు తులారాశి వారికీ కొంత సేపు ఆలా వదిలేస్తే వారే వచ్చి భాగస్వామితో మాట్లాడతారు.