మాస్టారు గారి నిర్లక్ష్యం....కరోనా బారిన పడ్డ చిన్నారులు!

ఒక పక్క కరోనా భయం తో స్కూల్స్ ఓపెన్ చెయ్యడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్న ఈ సమయంలో ఒక మాస్టారు గారు ఏకంగా ఇంటివద్దే ట్యూషన్ లను నిర్వహించి పలువురు చిన్నారులను ప్రమాదం లోకి తోసేశారు.ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలం లో చోటుచేసుకుంది.

 The Tuition Centre In Sattenapalli At Guntur District Becomes Corona Hotspot Cen-TeluguStop.com

అప్పుడే పాఠశాలలు తెరిస్తే కోవిడ్ ముప్పు పొంచి ఉంటుంది అని అధికారులు సైతం ఈ మహమ్మారి కి భయపడిపోతుంటే ఈ మాస్టారు మాత్రం ట్యూషన్ లను నిర్వహిస్తూ చిన్నారుల ప్రాణాల మీదకు తీసుకువచ్చారు.అసలుకే ఏపీ లో ఒకప్పుడు అత్యధికంగా నమోదు అవుతున్న గుంటూరు జిల్లా లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే….గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలం లోని భట్లురు గ్రామంలో ఒక వ్యక్తి ప్రైవేట్ ట్యూషన్ లు నిర్వహిస్తున్నారు.దీనితో ఆ ట్యూషన్ సెంటర్ కు దాదాపు 50 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.అయితే కరోనా మహమ్మారి తో అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి అంటూ ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అతగాడు నిర్లక్ష్యంగా వ్యవహరించి ట్యూషన్ సెంటర్ ను నిర్వహించాడు.

అయితే ఎలా అంటుకుందో గానీ ఆ ట్యూషన్ నిర్వాహకుడికే ఈ మహమ్మారి సోకింది.దీనితో ఆ ట్యూషన్ కు హాజరైన వారిలో 14 మంది విద్యార్థులకు కరోనా వ్యాపించినట్లు అధికారులకు సమాచారం అందింది.

అయితే కరోనా సోకిన విద్యార్థులలో అత్యధికమంది చిన్నారులు ఏడేళ్ల లోపు వారే కావడం గమనార్హం.దీనితో ఆ ట్యూషన్ సెంటర్ కరోనా స్పాట్ గా మారిపోయింది.

దీంతో అధికారులు సత్వరమే స్పందించి మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.మరోపక్క కరోనా సోకిన విద్యార్థులను గుంటూరులోని క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే కేసులు అధికంగా నమోదు కావడంతో భట్లూరు ఎస్సీ కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించినట్లు తెలుస్తుంది.మొత్తంగా విద్యార్థులతో కలిపి ఆ గ్రామంలో ఒకే రోజు 39 కేసులు నమోదు కావడంతో అక్కడ నివసిస్తున్న వారిలో ఆందోళన మొదలైంది.
అయితే ప్రభుత్వాలు విద్యాలయాలను, ట్యూషన్ సెంటర్ లను మూసివేయాలి అంటూ ఆదేశించినప్పటికీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా నిబంధనలు ఉల్లఘించి ట్యూషన్ నిర్వహించిన ఆ నిర్వాహకుడి పై కేసు నమోదు చేయాలి అంటూ కలెక్టర్ గారు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.ఒకపక్క కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటున్న ఈ సమయంలో ట్యూషన్ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి చిన్నారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.

మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా కేసులు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువ అవుతుండగా, మరణాల సంఖ్య 6 వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube