ఎమోషనల్ అయిన టక్ జగదీష్ డైరక్టర్ శివ నిర్వాణ..!

నానితో నిన్ను కోరి సినిమా చేసి హిట్ అందుకున్న శివ నిర్వాణ తన డైరక్షన్ లో సెకండ్ మూవీ అతనికి హ్యాట్రిక్ మూవీగా టక్ జగదీష్ చేశాడు.నాని, శివ కాంబో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి.

 Director Shiva Nirvana Got Emotional At Tuck Jagadish Trailer Release Event, He-TeluguStop.com

ఆ అంచనాలకు తగినట్టుగానే భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ తో టక్ జగదీష్ తెరకెక్కించారు.ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో డైరక్టర్ శివ నిర్వాణ ఎమోషనల్ అయ్యారు.

నాని టక్ జగదీష్ సినిమా ఓటీటీ రిలీజ్ పై జరిగిన గొడవ తెలిసిందే.ఈ విషయంపై స్పందించిన డైరక్టర్ శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమా 2 ఇయర్స్ షూటింగ్ జరుపుకున్న తర్వాత ఏప్రిల్ 16 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాము.

ఆ తర్వాత ఏప్రిల్ 23కి వాయిదా పడ్డది.

ఆ తర్వాత మే, జూన్, జూలై, ఆగష్టు లో కూడా రిలీజ్ అనుకున్నాం.

ఈ టైం లో కూడా నాని గారి ఇంటి పెంట్ హౌజ్ లో సినిమా గురించి మాట్లాడుతూ ఇంటర్వల్ బ్యాంగ్ లో విజిల్స్ పడతాయి.ప్రీ క్లైమాక్స్ కు క్లాప్స్ కొడతారు.

అక్కడ అదిరిపోద్ది.ఇక్కడ అదిరిపోద్ది అని అనుకున్నాం.

థియేటర్ లో ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ చుద్దాం అనుకున్నాం.థియేటర్ లో సినిమా కాదు అనుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాం.

నాని గారి గురించి ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది.ఐమాక్స్ లో అందరు సినిమా చేస్తే నాని మాత్రం డోర్ దగ్గర ఉండి చూశారు.

సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం.అలాంటి నానిని పట్టుకుని ఏదేదో మాట్లాడారని అన్నారు శివ నిర్వాణ.

షైన్ స్క్రీన్ బ్యానర్ సొంత బ్యానర్ అని.సినిమా గురించి ప్రతిరోజు మాతో డిస్కస్ చేశారు.ఇక ఇలాంటి టైం లో ఏం చేద్దామని అన్నారు.ఇక ఈ సినిమాను తాను 40 టూ 60 ఏళ్ల వరకు చూడాలని అనుకున్నాను.ఇది ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు.అంతేకాదు నిర్మాతలకు తనది, నానిది బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఆపైనా సరే థియేటర్ రిలీజ్ చేయమని అన్నామని శివ నిర్వాణ చెప్పారు.

థియేటర్ లో సినిమా రావాలని కోరుకునే నాని గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదని అన్నారు డైరక్టర్ శివ నిర్వాణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube