ఉగాదికి రాబోతున్న 'టక్ జగదీష్' థియేట్రికల్ ట్రైలర్ !

న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 Tuck Jagadish Theatrical Trailer Release On April 13, Tuck Jagadish, Nani, Theat-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

ఈ సినిమాను శివ నిర్వాణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు.పరిచయ వేదిక పేరుతో రాజమండ్రిలో ఒక ఈవెంట్ చేసారు.ఇందులో నాని ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిని స్టేజి మీద ప్రేక్షకులకు పరిచయం చేసారు.

అయితే ఇప్పుడు టక్ జగదీష్ నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.‘టక్ జగదీష్’ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 13 న విడుదల చేయబోతున్నారు.తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా ఈ వార్తని అధికారికంగా ప్రకటించారు.

ఈ పోస్టర్ లో నాని పెళ్లి కొడుకులా కళ్ళకు కాటుక, చేతికి పారాణి పెట్టుకుని పట్టు పంచె కట్టుకుని ఒక రధం ముందు నిలబడి ఉన్నాడు.

ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడిగా నటిస్తున్నాడు.జగపతిబాబు నానికి అన్నగా నటిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

https://twitter.com/Shine_Screens/status/1377520416852377601/photo/1

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube