నాని అభిమానులకు ముందస్తు ఫన్‌ తీసుకు రాబోతున్న 'టక్‌ జగదీష్‌'

యంగ్‌ హీరో నాని హీరోగా రూపొందుతున్న సినిమాలు మూడు కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.మూడు సినిమాల్లో మూడు కూడా విపరీతమైన క్రేజ్‌ ను కలిగి ఉన్నాయి.

 Tuck Jagadish Teaser Release The Before Nani Birthday,nani, Tuck Jagadish Teaser-TeluguStop.com

మూడు సినిమాలకు మూడు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అన్నట్లుగా ఎదురు చూసేలా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్ను కోరి సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న నాని శివ నర్వాన ల కాంబోలో రూపొందిన టక్‌ జగదీష్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

అయితే థియేటర్లు ఇటీవలే పునః ప్రారంభం అయిన కారణంగా సినిమా విడుదల విషయంలో కాస్త ఆలస్యంను పాటిస్తున్నారు.గత కొన్ని వారాలుగా నాని అభిమానులు టక్ జగదీష్‌ సినిమా టీజర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడు ఆ టీజర్‌ వస్తుందా అంటూ వెయిట్‌ చేస్తున్న అభిమానులకు నాని బర్త్‌ డే సందర్బంగా టీజర్‌ రాబోతుంది అంటూ యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది.
నాని బర్త్‌ డే కు అద్బుతమైన కానుక అంటూ అభిమానులు టక్‌ జగదీష్ టీజర్‌ కోసం వెయిట్‌ చేస్తుంటే ముందస్తుగానే టీజర్‌ ను తీసుకు రాబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.నాని పుట్టిన రోజుకు ముందే అంటే ఈనెల 23న సాయంత్రం 5.04 గంటలకు టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు.నాని పుట్టిన రోజు సందడి ఒక్క రోజు ముందే ప్రారంభం అవ్వబోతున్నందుకు అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న శ్యామ్‌ సింగరాయ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను కూడా నాని బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఇక అంటే సుందరానికి అనే సినిమా నుండి కూడా నాని పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకమైన పోస్టర్‌ ను విడుదల చేయబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube