టక్ జగదీష్ ప్రీమియర్‌కు ముహూర్తం ఫిక్స్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 Tuck Jagadish Streaming Time Update, Tuck Jagadish, Nani, Shiva Nirvana, Ritu Va-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ అప్పుడే క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాను తొలుత థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించినా, పలు కారణాల వల్ల అది కుదర్లేదు.

దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక పండగ పూట ఒక మంచి సినిమాను చూశామని ప్రేక్షకులు ఖచ్చితంగా ఫీల్ అవుతారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాను ఏ సమయానికి స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొనడంతో, ఈ విషయంపై చిత్ర యూనిట్, అమెజాన్ ప్రైమ్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.

టక్ జగదీష్ చిత్రాన్ని సెప్టెంబర్ 9న రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.దీంతో పండగ రోజుకంటే ముందే ఈ సినిమాను వీక్షించే అవకాశం కలిగిందని నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో, టక్ జగదీష్ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.అటు ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్‌గా ఉండబోతున్నట్లు, కుటుంబం కోసం నాని చేసే పనులు ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయని చిత్ర యూనిట్ అంటోంది.

నాని సరసన అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఐశ్వర్యా రాజేష్, జగపతి బాబులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి టక్ జగదీష్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube