రాజమండ్రిలో షూటింగ్ మొదలెట్టిన టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా టక్ జగదీష్.మొదటి రెండు సినిమాలతో క్లాస్ చిత్రాల దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శివ నిర్వాణ మూడో సినిమాని తనకి మొదటి అవకాశం ఇచ్చిన నానితోనే ఫిక్స్ అయ్యాడు.

 Tuck Jagadish Movie Shooting In Rajahmundry-TeluguStop.com

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.గత కొద్ది రోజులుగా పొలాచ్చిలో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ తాజాగా రాజమండ్రి లొకేషన్ కి షిఫ్ట్ అయ్యింది.

ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమాని కంప్లీట్ చేసిన నాని ఇప్పుడు టక్ జగదీశ్ ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.ఈ నేపధ్యంలో రెగ్యులర్ షూటింగ్ కి ప్రాధాన్యత ఇచ్చాడు.

ఇక దర్శకుడు శివ కూడా ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా నానితో ఉన్న కీలక సన్నివేశాలు అన్ని షూటింగ్ చేసేస్తున్నారు.ప్రస్తుతం రాజమండ్రిలో హీరోతో పాటు కీలక నటులు అందరూ ఉండే సన్నివేశాలు అన్ని పూర్తి చేయడానికి షెడ్యూల్ సిద్ధం అయినట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ఇందులో తెలుగమ్మాయిలు అయిన రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా చేస్తూ ఉండటంతో ఇది కూడా శివ తన స్టైల్ లోనే ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube