టక్ వేసుకుని కత్తి పట్టిన జగదీష్ నాయుడు

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం నాని తన కొత్త చిత్రం ‘టక్ జగదీష్’పై పూర్తి ఫోకస్ పెట్టాడు.

 Tuck Jagadish Movie First Look Released, Tuck Jagadish, First Look, Nani, Shiva-TeluguStop.com

దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను క్రిస్మస్ కానుకగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నాని టక్ వేసుకునే ఎక్కువగా కనిపిస్తాడని, అందుకే ఈ సినిమాకు టక్ జగదీష్ అనే టైటిల్ పెట్టినట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో ఎవరూ ఊహించని విధంగా భోజనం చేసేందుకు కూర్చున్న నాని, వెనకాల నుండి ఓ కత్తి తీస్తూ కనిపించాడు.

అయితే తినేటప్పుడు నాని కత్తి ఎందుకు తీశాడా అనే ప్రశ్నకు మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే సమాధానం లభిస్తుంది.ఇక ఈ సినిమాలో నాని పాత్ర పేరు జగదీష్ నాయుడు అని తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో నానితో పాటు జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ రీతూ వర్మ నటిస్తోంది.

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని రీతూ వర్మ చూస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2021లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.మరి ఈ సినిమాలో నాని ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube