టక్ వేసుకునేందుకు రెడీ అయిన నాని

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు నాని రెడీ అవుతున్నాడు.

 Tuck Jagadish All Set To Restart Shooting, Tuck Jagadish, Nani, Shiva Nirvana, T-TeluguStop.com

అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూసినా, కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు.
గతంలో ‘నిన్ను కోరి’ వంటి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శివ నిర్వాణ మరోసారి నానితో కలిసి ‘టక్ జగదీష్’ అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టిన నాని, కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశాడు.

కాగా ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే లాక్‌డౌన్ కారణంగా మిగతా సినిమాల్లాగా ఈ సినిమా పూర్తిగా ఎలాంటి పనులు జరుపుకోకుండా లేదు.ఇప్పటికే 40 శాతం సినిమా షూటింగ్ పూర్తి కాగా రీరికార్డింగ్ జరుపుకుంటోందట.

దీంతో పాటు ఎడిటింగ్ పనులు కూడా ఈ సినిమా తిరిగి ప్రారంభం కావడంతో, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.మొత్తానికి టక్ జగదీష్ చిత్రం షూటింగ్ మొదలయ్యే సరికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube