జగదీష్‌ టీంను ఇంటికి పంపించిన కరోనా  

Tuck Jagadeesh Movie Shooting Stop About Coronavirus Attack In Team, Naani, Tuck Jagadeesh, Siva Nirwana, Ninnu Cori, Coronavirus, - Telugu @nameisnani, Coronavirus, Naani, Ninnu Cori, Siva Nirwana, Tuck Jagadeesh

నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న టక్‌ జగదీష్‌ ఇటీవలే షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది.ఏడు నెలల తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాకు రెండు వారాలు కూడా కంటిన్యూగా షూటింగ్‌ జరుగకుండానే బ్రేక్‌ పడింది.

TeluguStop.com - Tuck Jagadeesh Movie Shooting Stop About Coronavirus

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉండగా యూనిట్‌ సభ్యుడు ఒకరు అనారోగ్యం బారిన పడ్డాడు.ఆయనకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట.

శివ నిర్వాన దర్శకత్వ టీమ్‌ లో పని చేసే ఆ వ్యక్తి దాదాపు అందరితో కూడా క్లోజ్‌ కాంటాక్ట్ లో‌ ఉన్నాడట.దాంతో యూనిట్‌ సభ్యులు అంతా కూడా క్వారెంటైన్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

TeluguStop.com - జగదీష్‌ టీంను ఇంటికి పంపించిన కరోనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పది రోజుల పాటు షూటింగ్‌ పూర్తిగా నిలిపేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు అందరూ నానితో సహా కరోనా నిర్థారణ పరీక్షకు సిద్దం అయ్యారు.

ఇదే సమయంలో వారు ఇళ్లకు పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో కూడా కలవడం లేదని తెలుస్తోంది.హీరో నాని కుటుంబం విషయంలో ఆందోళనతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ముఖ్యంగా కొడుకు జున్నుతో పూర్తిగా దూరంగా ఉండేందుకు గాను నాని ప్రయత్నిస్తున్నాడు.నాని అతి త్వరలోనే పరీక్ష చేయించుకోవాలని భావిస్తున్నాడు.

చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఇప్పటికే మరికొందరికి కూడా కరోనా సోకి ఉంటుంది అని కొందరు బలంగా నమ్ముతున్నారు.కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనాను కలిగి ఉంటున్నారు.

కనుక యూనిట్‌ సభ్యుల్లో కూడా కొందరు కరోనాను కలిగి ఉన్నా లక్షణాలు లేకపోవడం వల్లే వెంటనే గుర్తించలేక పోయాం అంటూ మేకర్స్‌ అంటున్నారు.ఫాస్ట్‌ గా టక్ జగదీష్‌ ను ముగించేయాలనుకున్న నానికి ఇదో బ్రేక్‌ మాదిరిగా అయ్యింది.

వచ్చే నెలతో అయినా ఈ సినిమాను శివ నిర్వాన పూర్తి చేస్తాడో చూడాలి.నాని, శివ నిర్వానల కాంబోలో నిన్ను కోరి సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.

#Ninnu Cori #@NameisNani #Tuck Jagadeesh #Coronavirus #Siva Nirwana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tuck Jagadeesh Movie Shooting Stop About Coronavirus Related Telugu News,Photos/Pics,Images..