అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్ధులు మృతి  

Three Ut Arlington Telugu Students Dead In Oklahoma Usa-telugu Students,three Ut Arlington

అమెరికాలో లో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలు భారత్ లో ఉంటున్న ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో తాజాగా జరిగిన నీటి ప్రమాద సంఘటనలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ముగ్గురు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు మృతి చెందిన వారిలో చెన్నారెడ్డి కేదార్నాథ్, ఓలేటి తేజ, కొయ్యాల మూడి అజయ్ ఉన్నారు...

Three Ut Arlington Telugu Students Dead In Oklahoma Usa-telugu Students,three Ut Arlington-Three UT Arlington Telugu Students Dead In Oklahoma USA-Telugu Ut

ఇదిలాఉంటే మృతి చెందినా ముగ్గురిలో కేదారినాథ్ నెల రోజుల క్రితమే అమెరికా వచ్చారని, అజయ్, తేజ ఇద్దరు అమెరికా వచ్చి ఆరు నెలలు అవుతోందని, వీరు ముగ్గురు టర్నర్స్ క్రీక్ పార్క్ వెళ్లి అక్కడ జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందారని స్థానిక పోలీసులు తెలిపారు.

ఇది ప్రమాద వశాత్తు జరిగిన సంఘటనే అని అన్నారు.

Three Ut Arlington Telugu Students Dead In Oklahoma Usa-telugu Students,three Ut Arlington-Three UT Arlington Telugu Students Dead In Oklahoma USA-Telugu Ut

వీరిలో ముందుగా ఒకరి నీటిలో మునిగిపోతుండగా, మరొకరుగా కాపాడేందుకు ప్రయత్నించి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.తేజ, అజయ్ , కేదార్నాథ్ ముగ్గురి మృతదేహాలు గురువారం డల్లాస్ రానున్నాయని, ఆ తరువాత వీరి ముగ్గురి మృతదేహాలను భారత్ కి పంపేందుకు భారతీయ కాన్సులేట్ అధికారులతో తానా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు అశోక్ బాబు ఆయన టీం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలుస్తోంది.