త్వరలోనే టీటీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక..!

టీడీపీ అధ్యక్ష పదవికి.పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు ఎల్.

 Tdp New President Elect Soon , Chandrababu, Election, L.ramana, Narsi Reddy, New-TeluguStop.com

రమణ.సీఎం కే.సి.ఆర్ ను కలవడం ఆయన టీ.ఆర్.ఎస్ పార్టీలోకి ఆహ్వానించడమే ఆలస్యం నెక్స్ట్ డే నే టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజీనామా లేఖ పంపించారు ఎల్.రమణ.టీ.ఆర్.ఎస్ ను వీడిన ఈటల ప్లేస్ ను బర్తీ చేయడానికి బలమైన బీసీ నాయకుడు కావాలనే కే.సి.ఆర్ ఎల్.రమణని టీ.ఆర్.ఎస్ లోకి ఆహ్వానం పలికినట్టు చెప్పుకుంటున్నారు.ఇక రమణ రాజీనామా చేయడంతో తెలంగాణా టీడీపీ ఖాళీ అయినట్టే పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణా టీడీపీ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో పడ్డారు పార్టీ నేతలు.టీటీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే ఉంటుందని అన్నారు తెలంగాణా టీడీపీ నాయకులు నన్నూరి నర్సి రెడ్డి.

టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యత మొత్తం చంద్రబాబుదే అని ఆయన అన్నారు.శనివారం పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

రేపు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, అనుబంధ సంఘాలతో సమావేశం ఉంటుందని నర్సిరెడ్డి అన్నారు.త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు.

 ఉన్న వారిలో ఎవరు సీనియర్.ఎవరు అధ్యక్ష పదవికి అర్హులో తేల్చుకుని వారిని టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube