కాంగ్రెస్‌, టీటీడీపీ దోస్త్ మేరా దోస్త్‌

మ‌హా కూట‌మి.తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌! అప్పుడ‌ప్పుడూ ఈ మాట బ‌లంగా వినిపించినా.

 Ttdp May Join With Congress-TeluguStop.com

త‌ర్వాత దీని ఊసే ఉండ‌దు.ఈసారి మాత్రం.

ఇది మ‌రింత బ‌లంగా వినిపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.శ‌త్రువుల మిత్రులుగా మారుతున్నారు.

మిత్రులు శ‌త్రువులు అయిపోతున్నారు.ప్ర‌స్తుతం మిత్రులుగా ఉన్న టీటీడీపీ, బీజేపీ.

విడిపోయే ప‌రిస్థితులు ఉండ‌గా.బ‌ద్ద‌శ‌త్రువులైన టీడీపీ, కాంగ్రెస్ ఒకే చెంత‌కు చేరేలా క‌నిపిస్తున్నాయి.

అంతేగాక ఈ రెండు పార్టీల నేత‌లు పొత్తుపై ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో ముందుకు వెళుతూ.మ‌హాకూట‌మి దిశ‌గా తొలి అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణలో కేసీఆర్‌.నానాటికీ బ‌ల‌ప‌డుతుండ‌గా.

ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీన‌ప‌డుతున్నాయి.ఉనికిని కోల్పోయే దుస్థితికి వ‌చ్చేశాయి.

అన్ని పార్టీలు విడివిడిగా పోరాటాలు చేస్తున్నా.అవి కేసీఆర్‌ను ఏమాత్రం క‌దిలించ‌లేక‌పోతున్నాయి.

పార్టీల‌కు తోడు జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్ కూడా తోడ‌వడంతో.మ‌హాకూట‌మి ఏర్ప‌డుతుంద‌న్న వార్త‌లు బలంగా వినిపించాయి.

కానీ ఇది ఊహాగానాల‌కే ప‌రిమిత‌మైంది.అయితే విడివిడిగా పోరాడితే.

కేసీఆర్‌ను ఢీ కొన‌డం క‌ష్ట‌మ‌ని అన్ని పార్టీలు ఇప్పుడు గుర్తించాయి.ఎన్నిక‌ల వేళ ఒక్కొక్క‌రుగా వెళితే.

ప్ర‌మాద‌మ‌ని గుర్తించి ఇప్ప‌టినుంచే ఐక్యంగా ఉండాల‌ని నిర్ణ‌యించాయి.

కేసీఆర్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ తోనైనా చేతులు కలుపుతామని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీని తాము అంటరాని పార్టీగా చూడటం లేదని, టీడీపీతో పొత్తును కొట్టిపారేయలేమంటూ కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం చూస్తే ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లు ఒకే తాటిపైకి వ‌చ్చేలా క‌నిపిస్తు న్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి.

నేరెళ్ల ఘ‌ట‌న ఈ రెండు పార్టీల‌ను ఒక్క‌టి చేసింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో దళిత యువకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఘ‌ట‌న వీరిని ఏకం చేసింది.

దీనిపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరుపుతోంది.జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేరెళ్ల సంఘటనపై విపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచాయి.

కాంగ్రెస్, టీటీడీపీ, క‌మ్యునిస్టులు, బీజేపీ, ప్రజాసంఘాలు అన్నీ కలిసి ఆందోళనకు దిగాయి.నేరెళ్ల సంఘటనపై తొలుత బీజేపీ స్పందించి.

మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిం ది.తర్వాత కాంగ్రెస్ ప్ర‌వేశించింది.ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగింది.గవర్నర్ ను కూడా కాంగ్రెస్ నేత‌లు కలిసి వినతిపత్రాన్ని అందించారు.2019 ఎన్నికలకు కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు మహా కూటమిని ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం.ఇందులో భాగంగా టీడీపీతో కలిసే అవకాశాలున్నాయంటున్నారు సీనియర్ నేతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube