బ్రేకింగ్‌: టీ టీడీపీ పూర్తిగా టీఆర్‌ఎస్‌ లో విలీనం

తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నిక అయిన విషయం తెల్సిందే.వారిలో సండ్ర వెంకట వీరయ్య ఎన్నికలు పూర్తి అయిన కొన్నాళ్లకే టీఆర్‌ఎస్ లో జాయిన్‌ అవ్వడం జరిగింది.

 Ttdp Legislative Party Merged In Trs, Kcr, Sandra Venkata Veeeraiah, Tdp, Telang-TeluguStop.com

ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు తాజాగా టీఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అవుతున్నట్లుగా ప్రకటించాడు.సీఎం కేసీఆర్‌ తో భేటీ అయిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు పలు విషయాలపై చర్చించి చివరకు టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కేందుకు సిద్దం అయ్యాడు అంటూ రాజకీయ వర్గాల ద్వారా వార్తలు వచ్చాయి.

అంతా భావించినట్లుగానే మెచ్చా నాగేశ్వర్‌ రావు టీఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అవ్వడంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది.

తెలుగు దేశం పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో జాయిన్‌ అవ్వడంతో టీడీఎల్పీని అధికారికంగా టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు.

స్పీకర్‌ పోచారంకు టీడీఎల్పీని టీఆర్‌ఎస్ లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు లేఖ ఇవ్వడం వల్ల అసెంబ్లీ కార్యదర్శ అధికారికంగా టీడీపీ పూర్తిగా టీఆర్ఎస్ లో విలీనం అయ్యిందని బులిటెన్‌ ను విడుదల చేయడం జరిగింది.తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు టీడీపీకి అస్సలు ప్రాతినిధ్యం లేదు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తరపున తెలంగాణలో పోటీ చేయడం కూడా కష్టమే.కనుక వెంకట వీరయ్య మరియు మెచ్చా నాగేశ్వర్‌ లు టీడీపీ కి చెందిన తెలంగాణ చివరి ఎమ్మెల్యేలు అంటున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ లోకి వీరిద్దరిని ఆ ఆపార్టీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube