ఆ పత్రికపై వంద కోట్ల పరువునష్టం దావా! టీటీడీ బోర్డు నిర్ణయం

ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం అధికార పార్టీతో పాటు విపక్షాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.ఎవరికీ వారు ప్రజలని మాయ చేసి రకరకాలుగా బురధజల్లుకుంటున్నారు.

 Ttd To Sue Andhra Jyothi For Rs 100 Crore-TeluguStop.com

దీని కోసం ఏకంగా దేవుడుని కూడా మధ్యలోకి తీసుకొచ్చేశారు.అధికార పార్టీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి మత మార్పిడిలని ప్రోత్సహిస్తుందని కొందరు విమర్శిస్తూ ఉంటే, మరో వైపు పవిత్ర దేవాలయాల వద్ద కూడా మత మార్పిడిలకి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీకి అండగా ఉండే పత్రికలలో కూడా మత మార్పిడిలు ఎక్కువ అయిపోతున్నాయని విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఆ మధ్య టీటీడీ వెబ్ సైట్ లో ఎసయ్య అనే పేరు ఉందని ఓ పత్రిక ఏకంగా కథనం రాసింది.

దానిపై తరువాత విచారణ చేయగా అది వాస్తవం కాదనే విషయం బయటపడింది.

ఇదిలా ఉంటే తాజా టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కీలక నిర్ణయాలని తీసుకున్నట్లు చైర్మన్ వైబి సుబ్బారెడ్డి చెప్పారు.టీటీడీ మీద తప్పుడు కథనాలు రాసిన పత్రిక మీద వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు కూడా చెప్పారు.

దీనిపై ఇప్పటికే పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు.టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకు సదరు పత్రిక మీద కోర్టులో కేసు వేస్తున్నట్లు తెలిపారు.

అలాగే గత ప్రభుత్వం హయాంలో తొలగింపబడిన రమణ దీక్షితులని ప్రధాన అర్చకుడుగా తీసుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube