కరోనా టైమ్ లోనూ తగ్గని తిరుమలేశుడి హుండీ ఆదాయం...

భారత దేశంలో ప్రసిద్ధి గాంచినటువంటి హిందూ ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.అయితే ఈ దేవస్థానం పేరుకే కాకుండా ఆలయ ఆదాయం లోనూ ముందుంది.

 In This Corona Time Also Ttd Is Getting Funds Through Online Ttd, Tirumala Tiru-TeluguStop.com

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా లాక్ డౌన్ విధించడంతో గత 50 రోజులుగా ఆలయాన్ని మూసివేశారు.అయినప్పటికీ ఈ ఆలయ హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆలయం మూసివేసి ఉన్నప్పటికీ కొందరు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారిక వెబ్ సైట్ కి లాగిన్ అయి ఆన్ లైన్ ద్వారా విరాళాలు పంపిస్తున్నారు.దీంతో కరోనా ఎఫెక్ట్ తిరుమలేశుడు హుండీ ఆదాయం పై ఏమాత్రం పడనట్లు తెలుస్తోంది.

అయితే ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ కారణంగా ఆలయం మూసివేసినప్పటికీ నిత్యం ఆలయంలో జరిగేటువంటి పూజలు, అభిషేకాలు జరుపుతూనే ఉన్నారు ఆలయ అధికారులు.

Telugu Hundi, Tirupati-

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని ఈ నెల 30వ తారీకు వరకు పొడిగించడంతో ఆలయం కూడా నెల 30 వ తారీకు వరకు మూసి వేసినట్లు సమాచారం.అయితే భక్తులు తిరుమలను సందర్శించకపోవడంతో భక్తుల ద్వారా వచ్చేటువంటి విరాళాలు, పర్యాటకం, హుండీ ఆదాయం వంటి వాటిపై కొంత మేర కరోనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందించే సదుపాయం ఉండడంతో కొంతమేర టీటీడీకి కరోనా కాలంలో కూడా ఆదాయం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube