తిరుమల లో కరోనా కలకలం,అర్చకుడితో సహా 10 మందికి  

10 corona positive cases registered from TTD , TTD, Tirumala, 10 Corona Cases, TTD Employes, Thurmal Screening, - Telugu 10 Corona Cases, Thurmal Screening, Tirumala, Ttd, Ttd Employes

లాక్ డౌన్ తరువాత తిరుమల వెంకన్న దర్శనానికి అవకాశం దొరకడం తో భక్తులు అందరూ కూడా ఎంతో సంతోషించారు.కరోనా మహమ్మారి వల్ల భగవంతుడిని కూడా దర్శించుకోలేకపోతుండడం తో చాలా మంది నిరుత్సాహ పడ్డారు.

 Ttd Tirumala 10 Corona Cases

అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వెంకన్న దర్శనానికి కూడా అనుమతులు లభించడం తో భక్తులు క్యూలు కడుతున్నారు.అయితే భక్తులతో రద్దీగా తయారు అవుతున్న తిరుమల లో కరోనా కలకలం రేగింది.

తాజాగా టీటీడీలో 10 మందికి ఈ మహమ్మారి సోకినట్లు తెలుస్తుంది.వీరిలో స్వామివారికి పూజా కైంకర్యాలు చేసే అర్చకుడికి కూడా లక్షణాలు బయటపడటంతో కలకలం నెలకొంది.

తిరుమల లో కరోనా కలకలం,అర్చకుడితో సహా 10 మందికి-General-Telugu-Telugu Tollywood Photo Image

వెంటనే అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు.వైరస్ సోకిన వారిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఓ అర్చకుడు,ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టుగా సమాచారం.

దశల వారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తుండగా.తాజాగా వీరి శాంపిల్స్‌ను పరీక్షించడం తో వారికి పాజిటివ్ అన్నట్లుగా తేలింది.

వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి,వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నారు.అసలు అనారోగ్యంగా ఉన్నవారిని పైకి అనుమతించడం లేదు.వరుసగా టీటీడీలో సిబ్బందికి కరోనా సోకడం భక్తులను కూడా అయోమయానికి గురి చేస్తోంది.

మరి ఇలా కరోనా టీటీడీ కి కూడా పాకడం తో భక్తులు ఇక వెంకన్న దర్శనానికి వస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

#Tirumala #TTD Employes #TTD #10 Corona Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ttd Tirumala 10 Corona Cases Related Telugu News,Photos/Pics,Images..