వ‌ర్షాల నేప‌థ్యంలో భ‌క్తుల‌కు తీపి కబురు చెప్పిన టీటీడీ..

ప్ర‌స్తుతం ఏపీలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.గ‌త మే నెల చివ‌రిలో వ‌చ్చిన నైరుతి రుతుప‌వ‌నాలు ఇప్పుడు తిరోగ‌మ‌నంలో ప‌డిపోయాయి.

 Ttd Says Good News To Devotees In The Wake Of Years .  Ttd, Floods, Devotees , T-TeluguStop.com

ఇలా తిరోగ‌మ‌నంలో వ‌స్తున్న సంద‌ర్భంగా స‌ముద్రంలో అల్ప పీడ‌నం ఏర్ప‌డింది.దీని కార‌ణంగా ఏపీలో, అటు త‌మిళ‌నాడులో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

దీంతో తిరుప‌తిలో విప‌రీతంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి.ఈ వ‌ర్షాల కార‌ణంగా తిరుప‌తిలో భ‌క్తుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయి.మామూలుగా ఈ స‌మ‌యంలో తిరుప‌తికి విప‌రీతంగా వ‌స్తుంటారు.అయితే ఇలా భారీ సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్న సంద‌ర్భంలోనే ఇలా వ‌ర్షాలు కుర‌వ‌డం ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.

ప్ర‌స్తుత నెల‌లో దేశ వ్యాప్తంగా చాలామంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తున్నారు.ఇలాంటి క్ర‌మంలోనే సాధార‌ణ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ష్టం అయిపోయింది.

ఇక వీఐపీ ద‌ర్శ‌నాల‌కు కూడా వీరిని అనుమ‌తించే ఆస్కారం లేకుండా పోయింది.ముందు నుంచే బుక్ చేసుకున్న వారు ఎంద‌రో ఉన్నారు.

ఇక సాధార‌ణ టికెట్లు బుక్ చేసుకున్న వారికి చేతిలో టికెట్లు ఉన్నా కూడా శ్రీవారిని ద‌ర్శించుకోలేని ప‌రిస్థితులు వ‌స్తున్నాయి.దీంతో వారికి ఊర‌ట నిచ్చే విదంగా టీటీడీ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది.

వీరి కోసం ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయిస్తాని చెబుతోంది.

Telugu Andra Pradesh, Devotees, Floods, Havey, Tickets, Tirupathi, Vip-Latest Ne

ఈ నెల 18 నుంచి 30 లోగా ద‌ర్శ‌నం చేసుకోలేక పోయిన వారికి మ‌రోసారి అవ‌కాశం ఇస్తామ‌ని టీటీడీ ప్ర‌క‌టించిది.ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కూడా డిజైన్ చేస్తున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.ఈ ప‌న్నెండు రోజుల్లో గ‌తంలో బుక్ చేసుకున్న వారు ఎవ‌రైతే ఉంటారో ఆ టికెట్ల నెంబర్ల‌ను ఎంట‌ర్ చేస్తే మ‌రోసారి వ‌చ్చే ఆరు నెలల వ‌ర‌కు ఇంకో స్లాట్ ను పొంద‌వ‌చ్చు.

వ‌చ్చే ఆరు నెల‌ల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మ‌రోసారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.భ‌క్తుల‌ను నిరాశ ప‌ర్చ‌డం ఇష్టం లేక‌నే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube