అన్యమత ప్రచారం పై దర్యాప్తు,టీటీడీపై కుట్ర జరుగుతుందా!

సప్తగిరి పత్రిక తో పాటు అన్యమత ప్రచారం కి సంబంధించి సజీవ వార్త అనే పత్రిక కూడా డెలివరీ అవ్వడం తో టీటీడీ అన్యమత ప్రచారం చేస్తుంది అంటూ టీటీడీ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.టీటీడీ అధికారిక పత్రిక సప్తగిరి పత్రిక లో అన్యమతానికి సంబందించిన పత్రిక కూడా జత అయి ఉండడం తో టీటీడీ అన్యమత ప్రచారం చేస్తుంది అంటూ ఆరోపణలు వచ్చాయి.

 Ttd Saptagiri Magazine Controversy Police Investigation Is Going On, Ttd Saptagi-TeluguStop.com

అయితే ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

వాస్తవానికి సప్తగిరి పత్రిక తో పాటు అన్యమత మ్యాగజైన్ అనేది అక్కడ ప్రచురితమైనది కాదని,గుంటూరు,విజయవాడ లలో ఆ పత్రిక ప్రచురితం అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

అంతేకాకుండా ఈ అంశం లో ఒక జర్నలిస్ట్ హస్తం కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

అయితే కావాలని టీటీడీ పై తప్పుడు ప్రచారం కోసమే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.టీటీడీ అధికార పత్రిక సప్తగిరి పత్రిక లో అన్యమతానికి చెందిన మ్యాగజైన్ కూడా కలిపి డిస్ట్రిబ్యూట్ చేశారు.

దీనితో టీటీడీ అన్యమత ప్రచారానికి దిగింది అంటూ విమర్శలు ఎదురయ్యాయి.గుంటూరు లో ఈ సజీవ సువార్త అన్న పత్రిక ను ప్రింట్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఎవరో కావాలనే టీటీడీ పై తప్పుడు ప్రచారం చేయడం కోసమే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా ఈ పత్రిక అనేది గుంటూరు,విజయవాడ లలోనే ఈ సజీవ సువార్త పత్రిక ప్రచురణ జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణ అయింది.

అయితే టీటీడీ పై కావాలనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని,ఎవరైతే ఈ పత్రిక ను బయటపెట్టారో ఆ పత్రికా విలేఖరి హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే టీటీడీ పై ఇలాంటి తప్పుడు ప్రచారం జరగడం తో దీనిని సీరియస్ గా తీసుకున్న టీటీడీ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube