శ్రీవారి భక్తులకు శుభవార్త.. వచ్చేనెల దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ!

Ttd Release Thirumala Srivari Darshanam Tickets For The Month Of February 2022 Today, Ttd, Release Darshanam Tickets, Srivari Darshanam Tickets, Tirupathi

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలియజేసింది.కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి స్వామివారి దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను విడుదల చేస్తూ రోజు పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Ttd Release Thirumala Srivari Darshanam Tickets For The Month Of February 2022 T-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనం కోసం అధికారులు నేడు టికెట్లను విడుదల చేయనున్నారు.ఈ క్రమంలోనే నేడు ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ అధికారులు కల్పించారు.

అలాగే రేపు ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను కూడా అధికారులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఫిబ్రవరి నెల నుంచి స్వామివారి దర్శన టికెట్లను పెంచుతారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శన టిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు.

స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ నందు బుక్ చేసుకోవాలని సూచించారు.ఇక స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని, దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేనిపక్షంలో 48 గంటల ముందు కరోనా పరీక్ష చేసుకుని నెగిటివ్ నిర్ధారణ అయిన రిపోర్ట్ తీసుకురావాలని సూచించారు.

Video : Ttd, Release Darshanam Tickets, Srivari Darshanam Tickets, Tirupathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube